Instagram Influencer Dies: ఇప్పుడంతా నడిచేది సోషల్ మీడియా హవానే. సోషల్ మీడియాలో నీకెంత మంది సబ్‌స్క్రైబర్లు, ఫాలోవర్లు ఉన్నాయని గర్వంగా చెప్పుకునే రోజులు ఇవి. నెటిజన్లను ఆకట్టుకునేందుకు.. సబ్‌స్క్రైబర్లు, ఫాలోవర్లు పెంచుకునేందుకు యువత అకృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా రీల్స్ కోసం సాహసం చేసి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో యూట్యూబర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
Also Read: Rape On Buffalo: ఎవడ్రా వీడు పశువుపై పైశాచికం.. గేదెపై అత్యాచారం
మహారాష్ట్రలోని రాయ్‌గడ్ సమీపంలో కుంభే జలపాతం ఉంది. అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాల నడుమ ఆ జలపాతం ఉండడంతో చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఇదే క్రమంలో 26 ఏళ్ల ఆన్వీ కామ్‌దార్ ఈ జలపాతం సందర్శించేందుకు మంగళవారం (జూలై 16) వచ్చారు. ముంబైలో నివసిస్తున్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందారు. తన 8 మంది స్నేహితులతో కలిసి అక్కడ ఆమె సందడి చేశారు. ఈ క్రమంలో జలపాతం వద్ద రీల్స్ చేసేందుకు ఆన్వీ ప్రయత్నాలు చేశారు. అయితే జలపాతం వద్ద లోయకు అంచు భాగంలో నిలబడి రీల్స్ చేసేందుకు ప్రయత్నించారు.
Also Read: Tragic Incident: వరదలతో తెగిన అన్నాచెల్లెలి అనుబంధం.. మృతదేహాన్ని 5 కి మీ మోసుకెళ్లిన అన్నలు
ప్రమాదకరంగా ఫోన్‌లో రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి 300 లోయలోకి పడిపోయారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి భయానకంగా తయారైంది. అక్కడికి వచ్చిన సందర్శకులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా అక్కడి పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కొన్ని గంటలపాటు సహాయ చర్యలు
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లోయలో పడిపోయిన ఆన్వీని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించారు. దాదాపు ఆరు గంటలపాటు కష్టపడి ఆమెను బయటకు తీశారు. అయితే భారీ ఎత్తు నుంచి కిందపడడంతో ఆన్వీ తీవ్ర గాయాలపాలై అప్పటికే మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
లక్షల్లో ఫాలోవర్లు.. మిలియన్ల వ్యూస్
ఈ సంఘటనతో ఆన్వీ స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆన్వీ మృతదేహాన్ని చూసి తీవ్రంగా విలపించారు. కాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ పరిశీలిస్తే లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. ఆమె దేశ విదేశాల్లో సందర్శిస్తూ అక్కడి విశేషాలు వివరిస్తూ గుర్తింపు పొందారు. మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్నాయి. అలాంటి ఆన్వీ ఇలా అనుకోకుండా జరిగిన సంఘటనలో దుర్మరణం పాలవడంతో ఆమె ఫాలోవర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఆన్వీ కామ్‌దార్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి