Dating Scam: పబ్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి అమ్మాయిల మోసం.. ఏడుగురి ముఠా అరెస్ట్

Mosh Pub Dating Scam Case Pub Owner And Delhi Gang Arrest: డేటింగ్‌ యాప్స్‌తో అబ్బాయిలను లక్ష్యంగా చేసుకుంటారు. అమ్మాయిలు పరిచయం పెంచుకుని పబ్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా తాగిస్తారు. భారీగా బిల్లు వేసి అనంతరం తుర్రుమంటారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 12, 2024, 02:44 PM IST
Dating Scam: పబ్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి అమ్మాయిల మోసం.. ఏడుగురి ముఠా అరెస్ట్

Mosh Pub Dating Scam: డేటింగ్‌ యాప్‌లే లక్ష్యంగా అబ్బాయిలతో వల వేస్తారు. పరిచయం చేసుకుని పబ్‌కు పిలుస్తారు.. ఫుల్లుగా తాగించి అడ్డమైన చార్జీలతో భారీగా బిల్లు వేస్తారు. బిల్లు కట్టే సమయంలో ఆ అమ్మాయిలు తుర్రుమంటారు. ఇదంతా ఓ కుట్ర. సులభంగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో పబ్‌ యజమాన్యాలు చేస్తున్న నయా దందా. వాస్తవంగా ఇదొక ముఠా చేసే వ్యాపారం. గతంలో ఇతర ప్రాంతాల్లో ఇదే తరహాలో మోసాలకు పాల్పడ్డారు. ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు వారి కుట్రను ఛేదించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌ పోలీసులు నయా దందాకు పాల్పడుతున్న వారిని అరెస్ట్‌ చేసి వివరాలు వెల్లడించారు.

Add Zee News as a Preferred Source

Also Read: King Cobra: హైదరాబాద్‌ రోడ్లపై తాచుపాము హల్‌చల్‌.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

 

మాదాపూర్‌లో మోష్ పబ్ ఉంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తుల ముఠా ఒక గ్రూపుగా ఏర్పడింది. నిరుద్యోగ యువతులను ట్రాప్ చేసి వారి పేరు మార్చి డేటింగ్ యాప్స్‌, వెబ్‌సైట్‌లో ఫొటోస్ పెట్టి అబ్బాయిలతో చాట్ చేస్తారు. అబ్బాయిలతో పరిచయం పెంచుకుని నెమ్మదిగా వారిని తమ వలపులోకి లాగుతారు. అబ్బాయిలను ట్రాప్ చేసి సమీపంలోని పబ్స్‌కు తీసుకు వెళ్తారు. వారికి ఆయా పబ్బుల్లో ప్రత్యేకమైన క్యూ ఆర్ కోడ్ మెషిన్ ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా సర్వ్ చేసే వాళ్లు ఉంటారు.

Also Read: Viral Incident: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం భర్త హల్‌చల్‌.. అర్ధరాత్రి పోలీసులకు ముప్పుతిప్పలు

 

డెవిల్స్ నైట్ పేరుతో సపరేట్ మెనూ అమ్మాయితో వచ్చిన కస్టమర్‌కి ఇస్తారు. అమ్మాయిలకు 10 ఎంఎల్‌, కస్టమర్‌కు 30 ఎంఎల్‌ ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. బిల్లింగ్ సమయానికి అమ్మాయి అసలు స్వరూపం బయటపడుతుంది. అబ్బాయిని మోసం చేసి పబ్‌ నుంచి అకస్మాత్తుగా పారిపోతుంది. బిల్లును చూసి అబ్బాయి ఖంగుతింటాడు. ఎంతకీ ఆ అమ్మాయి ఆచూకీ లభించదు. ఇక విధి లేక ఆ బిల్లును చెల్లించి వెళ్తాడు. ఎక్కువ బిల్లు వేసి ఆ మొత్తాన్ని ఆ ముఠా, అమ్మాయి, పబ్ నిర్వాహకులు పంచుకుంటున్నారు.

ఇలా ఈ ముఠా ఒక్క హైదరాబాద్‌లో నెల రోజుల్లో చెలరేగిపోయింది. డేటింగ్‌ యాప్స్‌, వెబ్‌సైట్‌లలో అబ్బాయిలను వల వేసి నలభై రోజుల్లో రూ.40 లక్షల వరకు మోసం చేశారు. అయితే ఈ గ్యాంగ్ నెల రోజుల తరువాత మరో ప్రాంతానికి తరలివెళ్తుంది. అక్కడ తమ వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభిస్తుంది. ఇలా అమ్మాయిల వలతో అబ్బాయిలను మోసం చేస్తున్న ముఠా ఆటలను మాదాపూర్‌ పోలీసులు కట్టిపడేశారు.

'హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్‌లో కూడా ఇదే తరహా మోసం చేయబోతుంటే పట్టుకున్నాం. ఈ ఆపరేషన్‌లో 8 మొబైల్స్, కియా కారు సీజ్ చేశాం' అని మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. ఈ మోసాలకు పాల్పడే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మోష్ పబ్ యజమానులు తరుణ్,జగదీశ్, మేనేజర్ చెరుకుపల్లి సాయి కుమార్‌లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News