/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Theft In Kamareddy Flipkart Hub: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో ఉన్న ప్రముఖ ఆన్‌లైన్ రీటేల్ స్టోర్ పోర్టల్ అయిన ఫ్లిప్‌కార్డ్ కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. ఫ్లిప్‌కార్ట్ కార్యాలయం తాళాలు పగలగొట్టిన దొంగలు.. కార్యాలయంలోని లాకర్ పగలగొట్టి అందులో ఉన్న 5,03,000 రూపాయల నగదును చోరీ చేశారు. ఈ ఘటనలో రూ. 5 లక్షల నగదుతో పాటు 10 సెల్ ఫోన్స్ కూడా చోరీ అయ్యాయి. చోరీకి వచ్చిన దుండగులు ఒక ప్లాన్ ప్రకారం ఎవ్వరికీ ఆనవాళ్లు కూడా చిక్కకూడదనే ఆలోచనతో ఫ్లిప్‌కార్డ్ కార్యాలయంలోని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు.

చోరీకి సంబంధించిన సాక్ష్యాలు పోలీసులకు చిక్కకుండా ఉండటం కోసం సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేయడంతో పాటు సెక్యురిటీ కెమెరాలు రికార్డు చేసిన ఫుటేజీ ఉండే డిజిటల్ వీడియో రికార్డర్ ని కూడా ఎత్తుకెళ్లారు. ఫ్లిప్‌కార్ట్ డీలర్‌షిప్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చోరీ ఘటన వెలుగులోకొచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న కామారెడ్డి జిల్లా పోలీసులు.. క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 

ఇది కూడా చదవండి : Popcorn Bill = Amazon Prime Cost: థియేటర్లో పాప్‌కార్న్‌కి అయ్యే ఖర్చుతో ఇంట్లోనే కూర్చుని ఏడాది మొత్తం సినిమాలు చూడొచ్చు

సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేయడం, డిజిటల్ వీడియో రికార్డర్ ని ఎత్తుకెళ్లడంతో నిందితులు ఎవరు, ఎంతమంది వచ్చారు, ఏ సమయంలో వచ్చారు అనే వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారిందని తెలుస్తోంది. అయితే, నిందితులు తమకు తెలియకుండానే అక్కడి వస్తువులపై ఏవైనా వేలి ముద్రలు వదిలి వెళ్లే అవకాశం లేకపోలేదు అనే కోణంలో కామారెడ్డి జిల్లా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : 7 members On 1 Bike: ఒక్క బైకుపై ఏడుగురి ప్రయాణం.. వీడియో వైరల్..

ఇది కూడా చదవండి : Lion Vs Farmer Video: ప్రాణాలకు తెగించి పులి నోటి నుంచి ఆవును రక్షించిన రైతు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Section: 
English Title: 
Theft In Flipkart Hub, thieves barged into kamareddy district Flipkart Hub and fled the scene with over rs 5 lakh cash and cell phones
News Source: 
Home Title: 

Theft In Flipkart Hub: ఫ్లిప్‌కార్ట్ ఫెసిలిటీలో భారీ చోరీ.. నగదు సెల్ ఫోన్స్ మాయం

Theft In Flipkart Hub: ఫ్లిప్‌కార్ట్ ఫెసిలిటీలో భారీ చోరీ.. నగదు సెల్ ఫోన్స్ మాయం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Theft In Flipkart Hub: ఫ్లిప్‌కార్ట్ ఫెసిలిటీలో భారీ చోరీ.. నగదు సెల్ ఫోన్స్ మాయం
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, July 4, 2023 - 06:50
Request Count: 
28
Is Breaking News: 
No
Word Count: 
243