Chittoor Murder Case: పాల వ్యాన్ డ్రైవర్‌తో ప్రేమాయణం.. భర్త హత్యకు భార్య మాస్టర్ ప్లాన్.. నాటకం రక్తికట్టించి చివరికి..

Wife Kills Husband in Chittoor: చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలంలో వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో భార్యే నిందుతురాలని తేలింది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2022, 11:59 AM IST
Chittoor Murder Case: పాల వ్యాన్ డ్రైవర్‌తో ప్రేమాయణం.. భర్త హత్యకు భార్య మాస్టర్ ప్లాన్.. నాటకం రక్తికట్టించి చివరికి..

Wife Kills Husband in Chittoor: ఆమె పెళ్లికి ముందు ఓ యువకుడితో ప్రేమలో ఉంది. పెళ్లి అయిన తరువాత కూడా అతడిని మర్చిపోలేకపోయింది. భర్తకు తెలియకుండా ప్రియుడికి నగలు ఇచ్చింది. భర్త నగల విషయం గట్టిగా నిలదీయడంతో ఇక తమ వ్యవహారం బయటపడుతుందని భయపడిపోయింది. ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్‌తో భర్తను హత్య చేయించింది. ఏమి తెలియనట్లే మళ్లీ ఆమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్ రికార్డింగ్ పరిశీలించిన పోలీసులు మహిళతో పాటు ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు సంచలనం రేకిత్తించిన ఈ ఘటన వివరాలు ఇలా..

పుంగనూరు మండలం బత్తలాపురానికి చెందిన దామోదర్‌కు, పెద్ద పంజాణి మండలం పెనుగొలకల గ్రామానికి చెందిన దామోదర్ (25), అనురాధ భార్యాభర్తలు. వీరిద్దరికి ఏడాది క్రితమే వివాహం జరిగింది. అనురాధ తండ్రి చంద్రమోహన్‌ గ్రామంలో  పాల సెంటర్ నిర్వహిస్తున్నాడు. అక్కడికి గంగరాజు (25) పాల వ్యాన్‌ డ్రైవర్‌గా వచ్చేవాడు. పెళ్లికి ముందే అనురాధతో గంగరాజు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమకు దారి.. కాస్త చనువు పెరిగింది. అనురాధకు పెళ్లి అయిన తరువాత కూడా ఇద్దరి మధ్య బంధం కొనసాగింది.

ఈ నేపథ్యంలోనే అనురాధ వద్ద నగలు తీసుకున్న గంగరాజు తాకట్టు పెట్టాడు. నగలు కనిపించకపోవడంతో అనురాధను భర్త దామోదర్ నిలదీశాడు. దీంతో తమ రహాస్య బంధం బయటపడిపోతుందని భయపడిన అనురాధ.. విషయం ప్రియుడికి చెప్పింది. నోముల పండుగకు భర్తతో కలిసి అనురాధ పుట్టింటికి వచ్చింది. సోమవారం రాత్రి బైక్‌పై ఇద్దరు తిరిగి వెళుతుండగా.. తుర్లపల్లి సమీపంలో దారిలో గంగరాజు అడ్డుగా వచ్చి దామోదర్ కళ్లలో కారం కొట్టాడు.

అనంతరం కత్తి తీసుకుని విచాక్షణ రహితంగా పొడిచాడు. హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తరువాత నాటకాన్ని అనురాధ రక్తికట్టించింది. నగల కోసం కొంతమంది తన భర్తపై కారం చల్లి హత్య చేశారని వాపోయింది. దీంతో అందరూ నిజమేనని నమ్మారు. తన భర్తను హత్య చేశారంటూ పోలీసులకు అనురాధ ఫిర్యాదు చేసింది. పోలీసులు అనురాధ కాల్ లిస్ట్ చెక్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

అనురాధ ఇచ్చిన సమాచారంతోనే గంగారాజు దారిలో హత్య చేసేందుకు రెడీగా ఉన్నాడని తేలింది. భర్తను హత్య చేస్తే.. తమ బంధానికి అడ్డు తొలగిపోవడంతోపాటు నగల పంచాయితీ కూడా తీరిపోతుందని స్కెచ్ వేసినట్లు సమాచారం. డ్రైవర్ గంగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనురాధతోపాటు అతడిని విచారించి వివరాలు ఆరా తీశారు. హత్యకు ఇంకా ఎవరెవరు సహరించారనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు. 

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ పరుగుల దాహం తీరనిది.. మరో రికార్డుకు చేరువలో..    

Also Read: YSRCP MLA Tears: కన్నీళ్లు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. కష్టాలు తెలుసుకుని భావోద్వేగం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News