Mahanati Best Scenes : కొన్ని సినిమాలు థియేటర్స్ నుంచి బయటకు రాగానే మరిచిపోతాము. కొన్ని సినిమాలు మాత్రం మనం చూసిన రెండు రోజులు లేదా వారం వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రమే మనతో జీవితాంతం ప్రయాణిస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలను ఎన్నిసార్లు చూసినా.. మనకి మొదటిసారి కలిగిన ఎమోషన్స్..మళ్లీ మళ్లీ కలుగుతుంటాయి. వాటినే మనం కల్ట్ క్లాసిక్స్ అంటాం.. అలాంటి సినిమాలలో ఒకటి.. మహానటి. ఎన్నిసార్లు చూసినా రవ్వంత కూడా బోర్ కొట్టకుండా ఉండేలా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్.
మహానటి సావిత్రమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాల హీరోయిన్స్ రేంజ్ ని పెంచిన నటి సావిత్రి. ఎంతోమంది ఆమెను సావిత్రి అనకుండా.. సావిత్రమ్మ అంటారు అంటేనే ఆమెకున్న గుర్తింపు అర్థమవుతుంది. అలాంటి గొప్ప నటి గురించి.. ఎంతో గొప్పగా సినిమా తీశారు నాగ్ అశ్విన్. మహానటి సినిమా నాగ్ అశ్విన్ కి కేవలం రెండవ సినిమా మాత్రమే. కానీ వంద సినిమాలు తీసిన దర్శకుడు కూడా తీయలేనంత అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2018 మే 9 న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈరోజుతో ఈ సినిమా విడుదలై ఆరు సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా.. ఈ సినిమా నుంచి ఎప్పటికీ మర్చిపోలేని ఆరు అపురూప సన్నివేశాల గురించి చూద్దాం..
వ్యక్తిత్వం గురించి రాయాలంటే అర్హత కావాలి
సినిమా టైటిల్ వేసిన దగ్గర నుంచి.. ఈ చిత్రంపై ప్రేక్షకులకు ఆసక్తి తెప్పించారు దర్శకుడు. ఇక ఆ తరువాత మధురవాణి (సమంత).. సావిత్రి గురించి బుక్ రాయాలి అనుకున్నప్పుడు.. ఒక ఫోటో స్టూడియో కి చెందిన వ్యక్తి (నరేష్) దగ్గరకు వెళుతుంది.. అప్పుడు అతను ఒక డైలాగ్ చెబుతారు…’వ్యక్తిత్వం గురించి రాయాలంటే అర్హత కావాలి’ అని.. అక్కడ మొదలవుతుంది.. సావిత్రి గొప్పతనం గురించి దర్శకుడు చెప్పడం. ఆ సన్నివేశం దగ్గర నుంచి చివరి వరకు.. సావిత్రి వ్యక్తిత్వం గురించి ఎంతో అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చారు నాగ్ అశ్విన్.
రెండంటే రెండే చుక్కలు
ఎదమ కంటి నుంచి రెండంటే రెండే చుక్కలు రావాలి అని దర్శకుడు చెప్పినప్పుడు.. సావిత్రి సన్నివేశాన్ని అలానే చేసి చూపిస్తుంది. ఈ సన్నివేశంలో నాగ్ అశ్విన్ దర్శకత్వం, కీర్తి సురేష్ నటన రెండు కూడా అద్భుతంగా కనిపిస్తాయి.
రావోయి చందమామ
ఈ సినిమాలో మరో హైలెట్ దుల్కర్ సల్మాన్. జెమినీ గణేషన్ గా ఈ హీరో నటించారు అనడం కన్నా.. జీవించారు అని చెప్పొచ్చు. అమ్మాడి అని సావిత్రిని పిలిచి తనను పెళ్లి చేసుకునే దగ్గర నుంచి.. ఆ తరువాత రావోయి చందమామ సాంగ్ వరకు.. సినిమాలో సావిత్రి, జెమినీ గణేషన్ ప్రేమను ఎంతో చూడచక్కగా చూపించాడు డైరెక్టర్. ఈ సన్నివేశాలు చూస్తే నిజంగానే సావిత్రి, జెమినీ గణేషన్ ప్రేమలో పడడం కరెక్టేమో అని మనకి కూడా అనిపించక మానదు.
మాయాబజార్ సన్నివేశం
మాయాబజార్ సినిమాలో సావిత్రి నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరలా అలాంటి సినిమాలోని అద్భుతమైన సన్నివేశాలను తిరిగి వెండి తెరపై చూపించాడు దర్శకుడు. సావిత్రి ఎంతో అద్భుతంగా నటించినా ఆహనా పెళ్ళంట పాటను.. కీర్తి సురేష్.. సావిత్రిలానే నటించి.. ఆ సన్నివేశానికే ఊపిరి పోసింది. ఈ సన్నివేశం చూస్తే నిజంగానే కీర్తి సురేష్ ప్రస్తుత తరానికి చెందిన సూపర్ స్టార్ అని అనకుండా ఉండలేము.
అప్పుడు నేను సావిత్రి ఇప్పుడు నేను సావిత్రి గణేషన్
సావిత్రి పతనం మొదలైన దగ్గర నుంచి.. కీర్తి సురేష్ నటన మరో అద్భుతం. ముఖ్యంగా జెమినీ గణేషన్ వేరొక హీరోయిన్ తో సావిత్రి చూసిన దగ్గర నుంచి.. వచ్చే ప్రతి సన్నివేశంలో కీర్తి సురేష్ తన అద్భుతం. అలానే ‘అప్పుడు నేను సావిత్రి ఇప్పుడు నేను సావిత్రి గణేషన్’ అనే డైలాగ్ దెగ్గర నుంచి ‘అనగా అనగా మొదలై కథలు పాట’ వరకు.. ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్.
ఆకాశ వీధిలో అందాల జాబిలి.. అనగనగా ఒక మహానటి
ఈ చిత్రం ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్.. ఎలాంటి వారికైనా కన్నీళ్లు తెప్పించకుండా ఉండదు. తన చీర అమ్మి మరీ టాక్సీ డ్రైవర్ కి డబ్బులు ఇచ్చే దగ్గర నుంచి.. చివరిలో సమంత.. సావిత్రి గురించి చెప్పే మాటల వరకు.. ప్రతి సన్నివేశం.. ఒక అద్భుతం. ఈ చివరి సన్నివేశాలు చూస్తేనే.. నాగ్ అశ్విన్ తెలుగు ప్రేక్షకులకు దొరికిన ఒక వజ్రం లాంటి దర్శకుడు అని అర్థమయిపోతుంది.
Also Read: Revanth Reddy: శిష్యుడు ఎవరు? గురువు ఎవరు? చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Also Read: Rashmi Gautam: ట్రోలర్ కి రష్మీ షాకింగ్ రిప్లై.. రేపు నీ పిల్లలని చంపుతాడు జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter