Actor John Abraham: దేశంలో సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. బాలీవుడ్లో ఇప్పటికే కరీనా కపూర్, అర్జున్‌కపూర్, సన్యా కపూర్, మృనాల్ ఠాకూర్, నోరా ఫతేహి, శిల్పా శిరోద్కర్‌లతో సహా పలువురు ప్రముఖులకు కొవిడ్ పాజిటివ్‌గా ( COVID positive) నిర్ధారణ అయ్యింది. తాజాగా హీరో జాన్ అబ్రహంతో (Actor John Abraham) పాటు అతడి భార్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని జాన్ ఇన్‌స్టా (Instagram) వేదికగా వెల్లడించారు.
''మూడురోజుల కిందట తాను ఓ వ్యక్తిని కలిశానని, అతడికి పాజిటివ్‌గా తేలడం వల్ల తాను, భార్య ప్రియ వైద్య పరీక్షలు చేసుకున్నామని... తామిద్దరికి కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో...ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నామని'' జాన్ అబ్రహం తెలిపారు. అభిమానులందరూ మాస్క్‌లు ధరించి, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జాన్ అబ్రహం నటించిన 'సత్యమేవ జయతే 2' (Satyameva Jayate2).. జనవరి 25న విడుదల కావాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆదివారం దర్శకుడు రాహుల్ రావైల్(70) (Rahul Rawail) కూడా కోవిడ్ బారిన పడ్డారు. రాహుల్ రావైల్ 1983లో అర్జున్, 1985లో బేతాబ్, 1991లో మస్త్ కలందర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
Actor John Abraham and his wife Priya Runchal test positive for COVID-19
"We both are vaccinated and experiencing mild symptoms," the actor says
(File photo) pic.twitter.com/JsEe4gshuv
— ANI (@ANI) January 3, 2022
Also Read: Jersey Heoine: జెర్సీ హీరోయిన్ మృణాల్‌కు కోవిడ్ పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook