Nani's V on OTT: ఓటీటీలోనే నాని సినిమా V!

నేచురల్ స్టార్ నాని 25వ సినిమా ‘వి’ ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని 5 నెలలుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఓటీటీ వైపు దిల్ రాజు మొగ్గు చూపారు. వి సినిమా (Nani's V on OTT) విడుదలపై త్వరలో ప్రకటన రానుంది.

Last Updated : Aug 14, 2020, 10:49 AM IST
  • లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి కారణంగా సినిమా హాళ్లు మూసివేత
  • నాని 25వ సినిమా ‘వి’కి తొలగనున్న అడ్డంకులు
  • గతంలో నాని V ఓటీటీ ఆఫర్ రిజెక్ట్ చేసిన దిల్ రాజు
  • ఇప్పుడు ఓటీటీకే మొగ్గుచూపుతున్న మూవీ యూనిట్
Nani's V on OTT: ఓటీటీలోనే నాని సినిమా V!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani 25th Movie V) 25వ సినిమా ‘వి’ ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని 5 నెలలుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఉగాది పండుగ కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అంతా సిద్ధం చేశారు. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడం, సినిమా హాళ్లపై నిషేధంతో వి విడుదల ఆగిపోయింది. Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు

శ్రీవెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు నిర్మాణ సారథ్యం వహించిన ఈ సినిమాకు మోహ‌న‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. శిరీష్, ల‌క్ష్మణ్ హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లు. నాని (Actor Nani)తో పాటు సుధీర్‌భాబు, అదితి రావు హైద‌రీ, నివేదా థామ‌స్ కీలక పాత్రలు పోషించారు. కొన్ని నెలల కిందట ఓటీటీ నుంచి భారీగా డిమాండ్ వచ్చినా దిల్ రాజు అందుకు నో చెప్పారు. కానీ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో ఓటీటీ వైపు (V Movie on OTT) దిల్ రాజు మొగ్గు చూపారు.  అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos    
Monsoon Diet; వానాకాలంలో ఈ కూరగాయలు తినాలి.. అసలే కరోనా ఉంది 

ఇందుకోసం ప్రముఖ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే సెప్టెంబర్ నెలలో నాని ‘వి’ సినిమాను ఓటీటీలో చూసే ఛాన్స్ ఉంది. దీనిపై త్వరలో మూవీ యూనిట్ లేక, దిల్ రాజుగానీ అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..

Trending News