RRR Movie: ఆర్ఆర్ఆర్ జట్టులో చేరిన ఆలియా

కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లన్నీ ఇప్పుడిప్పుడే వేగవంతం అవుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్‌లో.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ప్రధాన పాత్రల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ కూడా చకచకా జరుగుతోంది.

Last Updated : Dec 7, 2020, 01:40 PM IST
RRR Movie: ఆర్ఆర్ఆర్ జట్టులో చేరిన ఆలియా

actress Alia Bhatt joins RRR Movie shooting: కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లన్నీ ఇప్పుడిప్పుడే వేగవంతం అవుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్‌లో.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ప్రధాన పాత్రల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ ( RRR Movie ) సినిమా షూటింగ్‌ కూడా చకచకా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలనే రాత్రివేళ కీలక సన్నివేశాలను చిత్రీకరించింది చిత్రయూనిట్. అయితే ఈ రోజునుంచి మహాబలేశ్వరంలో ఈ చిత్రం షూటింగ్ జరగనుంది.

ఈ తరుణంలోనే ఆర్ఆర్ఆర్ లో సీత పాత్ర చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ( Alia Bhatt ) కూడా సోమవారం చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయింది. అయితే రాజమౌళి.. రామ్ చరణ్, ఆలియా మధ్య కీలక సన్నివేశాలను చిత్రకరించనున్నారని తెలుస్తోంది. రాజమౌళి, అలియా మాట్లాడుకుంటున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ అలియా ఈ రోజు నుంచి రెగ్యూలర్‌గా షూటింగ్‌లో పాల్గొంటుందని సమాచారం. Also read: Alia Bhatt: తారక్ రిక్వెస్ట్‌ చేశాడనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడా ?

ఈ సినిమాను దాదాపు 300 కోట్లతో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. రౌద్రం ర‌ణం రుధిరం ( RRR ) సినిమాను రాజ‌మౌళి చ‌రిత్ర, ఫిక్షన్‌ అంశాల కలబోత ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ (Jr. NTR)‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా  రామ్‌చరణ్  (Ram charan) నటిస్తున్నారు. వారి సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా, అజయ్ దేవగణ్ (Ajay Devgan), శ్రియ (Shriya Saran) కీలకపాత్రల్లో నటిస్తున్నారు. Also read: Coronavirus Movie: కరోనావైరస్‌కు రుణపడి ఉన్నాను: ఆర్జీవీ

 Also read: Sonal Chauhan: లెజెండ్ భామ సోనాల్ చౌహాన్ లేటెస్ట్ పిక్స్ చూశారా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News