Fatima Sana Shaikh about sexual abuse and casting couch: అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'దంగల్' సినిమాలో రెజ్లర్ గీతా ఫోగట్ పాత్రలో నటించిన ఫాతిమా సనా షేక్ తనకు మూడేళ్ల ప్రాయంలోనే లైంగిక వేధింపులు ఎదుర్కొందట. ఈ విషయాన్ని స్వయంగా ఫాతిమానే వెల్లడించింది. తాజాగా పింక్విల్లా.కామ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని అనేక ఆసక్తికరమైన అనుభవాలు పంచుకున్న ఫాతిమా సనా షేక్.. తన జీవితంలోనూ మర్చిపోలేని భయంకరమైన అనుభవాలు ఉన్నాయంటూ మూడేళ్ల వయస్సులోనే వేధింపులకు ( Sexual harassments ) గురైన వైనాన్ని వెల్లడించింది. లైంగిక వేధింపుల విషయానికొస్తే.. మహిళలు ఆ విషయం ఎత్తడానికే భయపడతారని.. అటువంటి విషయాలు ప్రస్తావించొద్దనే ప్రపంచంలో మనం బతుకీడుస్తున్నామని ఫాతిమా సనా షేక్ అసహనం వ్యక్తంచేసింది. అందుకే మహిళలు ఎవ్వరూ ధైర్యంగా లైంగిక వేధింపుల గురించి మాట్లాడరు అని చెప్పుకొచ్చింది. Also read : Bhumika in Anasuya's place: యాంకర్ అనసూయ స్థానంలో భూమిక
లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా బయటికి వచ్చి తమ గొంతు వినిపించేలా వారిలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఫాతిమా అభిప్రాయపడింది. తాను కూడా కాస్టింగ్ కౌచ్‌ను ( Casting Couch ) బాధితురాలినే అని చెప్పిన ఫాతిమ.. సెక్స్‌కు అంగీకరించపోతే అవకాశాలు కూడా లభించని దుస్థితి లేకపోలేదని అన్నారు. ఇంకొన్నిసార్లు తనకు వచ్చిన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. Also read : Kajal Aggarwal ties knot: గౌతం కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్
ప్రస్తుతం లుడో ( Ludo ), సూరజ్ పే మంగల్ భరీ ( Suraj Pe Mangal Bhari ) సినిమాల్లో నటిస్తోన్న ఫాతిమా సనా షేక్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అటు సినీ పరిశ్రమలో ఇటు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. Also read : Sai Pallavi, Pawan Kalyan: పవన్ కల్యాణ్ సరసన సాయి పల్లవి ?