Namitha Pregnant: 41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న హీరోయిన్.. వైరల్‌గా మారిన బేబీ బంప్ ఫోటోస్!

Actress Namitha announces pregnancy. సీనియర్ హీరోయిన్ నమిత శుభవార్త చెప్పారు. ఈరోజు నమిత పుట్టినరోజు సందర్భంగా తాను గర్భవతి అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 10, 2022, 03:37 PM IST
  • 41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న హీరోయిన్
  • వైరల్‌గా మారిన బేబీ బంప్ ఫోటోస్
  • ఇంతకు ముందు ఎప్పుడూ లేని కొత్త ఫీలింగ్
Namitha Pregnant: 41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న హీరోయిన్.. వైరల్‌గా మారిన బేబీ బంప్ ఫోటోస్!

Actress Namitha announces her pregnancy, Baby Bump Pictures goes viral: ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు సీనియర్ హీరోయిన్స్ మాతృత్వం పొందిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో శ్రీయ సరన్ ఓ పండండి బిడ్డకు జన్మనివ్వగా.. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా అమ్మ తనాన్ని పొందారు. ఇక ప్రణీత శుభాష్, సంజన గల్రాని కూడా తాను ప్రెగ్నెంట్ అంటూ ఇటీవలే తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి సీనియర్ హీరోయిన్ నమిత కూడా చేరారు. 

నేడు (మే 10) నమిత పుట్టిన రోజు. నేటితో ఆమె 41వ పడిలోకి అడుగుపెట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు శుభవార్త చెప్పారు. తాను గర్భవతి అనే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. తన బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌ చేశారు. 'మాతృత్వం.. నా జీవితంలో కొత్త అధ్యాయం ఆరంభం అయింది. నేను మారాను, నాలోనూ పెను మార్పు వచ్చింది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. కొత్త జీవితం, కొత్త పిలుపులు, మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా. చిన్నారి కదలికలు కొత్త అనుభూతి ఇస్తున్నాయి. ఈ ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది' అని నమిత ఎమోషనల్ అయ్యారు. 

2002లో ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన 'సొంతం' సినిమాతో నమిత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో నమిత నటనకు మంచి మార్కులే పడ్డాయి. అందం, అభినయం, సొట్ట బుగ్గలతో కుర్రాళ్ల మదిని దోచారు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్‌తో జెమిని సినిమా చేశారు. దాంతో ఆమె ఒక్కసారిగా స్టార్ అయ్యారు. రవితేజతో ఒకరాజు-ఒకరాణి, ప్రభాస్‌తో బిల్లా, బాలకృష్ణ తో సింహా వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో కంటే తమిళంలో నమిత ఎక్కువగా సినిమాలు చేశారు. తమిళంలో ఆమెకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు అంటే నమిత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

 

సినీ కెరీర్ కొంచెం నెమ్మదించాక.. 2017లో వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని నమిత వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం కూడా ఆమె అడపాదడపా సినిమాల్లో నటించారు. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా తాను ప్రెగ్నెంట్ అనే శుభవార్తను అందరితో పంచుకున్నారు. దాంతో పలువురు అభిమానులు, ఇండస్ట్రీ వారు ఆమెకు విషెస్ తెలుపుతున్నారు. నమిత 41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్నారు. 

Also Read: Blood Moon Lunar Eclipse 2022: బ్లడ్ సూపర్ మూన్ చంద్రగ్రహణం ప్రత్యేక ఏంటి.. ఎప్పుడు, ఎలా చూడాలంటే?

Also Read: Tamannaah Bhatia Pics: మినీ డ్రెస్సులో తమన్నా.. మిల్కీ బ్యూటీ అందాలకు కుర్రకారు ఫిదా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x