Aditi Rao: హీరోయిన్స్ దగ్గరకొచ్చి మాత్రం ఆ మాట అంటారు.. అదితిరావు హైదరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Aditi Rao Hydari: అదితిరావు హైదరీ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ తనకు నచ్చింది చేస్తూ ఉంటుంది.‌ సిద్ధార్థ కి తనకు మధ్య ఏదో ఉంది అని అందరూ గుసగుసలాడుకుంటున్న.. పట్టించుకోకుండా సిద్ధార్థ తో ఇంస్టాగ్రామ్ లో వీడియోలు కూడా పెడుతూ ఉంటుంది ఈమె. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2023, 09:40 PM IST
Aditi Rao: హీరోయిన్స్ దగ్గరకొచ్చి మాత్రం ఆ మాట అంటారు.. అదితిరావు హైదరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Aditi Rao Hydari interview: సమ్మోహనమే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ అదితిరావు హైదరీ…కాగా ఈ హీరోయిన్ తెలుగులో మాత్రమే కాదు తమిళంలో, హిందీలో కూడా ఎన్నో సినిమాలు చేసి పేరు తెచ్చుకుంది.

ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే నాని, శర్వానంద్, సిద్ధార్థ్ లాంటి యువ నటులతో నటించింది అతిధి. కాగా ఈమె సినిమాలకన్నా ఎక్కువ సిద్ధార్థ తో తన రిలేషన్షిప్ వల్లే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎన్నో రోజుల నుంచి వార్తలు షికార్లు కొడుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఎన్నో కార్యక్రమానికి వీరిద్దరూ కలిసి అటెండ్ అవ్వడం అలానే ఇంస్టాగ్రామ్ లో వీరిద్దరూ కలిసి ఫోటోలు, వీడియోలు పెట్టడం ఆ వార్తకు మరింత బలం చేకూర్చింది…అయితే వీరిద్దరి ప్రేమ పెళ్లి గురించి మాత్రం ఇంకా వీళ్ళు క్లారిటీ ఇవ్వకపోవడం విశేషం..

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 
 తాజాగా బాలీవుడ్ లోని ఓ ప్రముఖ సినీ మీడియా సినీ పరిశ్రమలోని పలువురు మహిళా ప్రముఖుల్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వారందరూ సినిమాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో అదితిరావు కి ఒక యాక్టర్ గా మీరు ఏం వినకూడదు అనుకుంటున్నారు అనే ప్రశ్న ఎదురుగా దానికి అందరిని ఆకట్టుకునే సమాధానం చెప్పింది ఈ హీరోయిన్.

ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ..’ఎవరైనా వచ్చి ఇది హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అని చెప్పడం వినకూడదు అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఎవరూ కూడా హీరోల దగ్గరికి వెళ్లి ఇది హీరో సెంట్రిక్ ఫిలిం అని చెప్పారు. మన కథ చెప్తాము అంతే. అందరూ కథలు చెప్పడానికే ఇక్కడ ఉన్నారు. కానీ హీరోయిన్స్ విషయానికి వస్తే మాత్రం వారి దగ్గరికి వచ్చి వాళ్ళు ..ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని కథ చెప్తారు. నేను ఆ మాట వినకూడదు అనుకుంటాను’ అని తెలిపింది ఈ హీరోయిన్.

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News