Pawan Kalyan: అకిరాకి ఎస్ చెప్తా.. పవన్ కి నో చెప్తా.. అడివి శేష్ షాకింగ్ కామెంట్స్

Adivi Sesh: వైవిద్యమైన చిత్రాలు చేయడంలో ముందుంటారు తెలుగు హీరో అడివి శేష్. వరస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈ హీరోకి పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా కి చాలా మంచి స్నేహం ఉందట. ఈ క్రమంలో శేష్ ..అకిరా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2024, 07:43 PM IST
Pawan Kalyan: అకిరాకి ఎస్ చెప్తా.. పవన్ కి నో చెప్తా.. అడివి శేష్ షాకింగ్ కామెంట్స్

Akira Nandan:
వైవిద్యమైన కథలు ఎంచుకొని వరస సూపర్ హిట్ లో అందుకుంటున్న హీరో అడివి శేష్. అయితే ఈ హీరోకి పవన్ కళ్యాణ్ కొడుకు అకిరాకి చాలా మంచి స్నేహబంధం ఉంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ఎన్నో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయి అందరిని ఆశ్చర్యపరిచాయి. అసలు వీరిద్దరికీ ఎలా పరిచయం.. అనే సందేహాలు ఎన్నోసార్లు అభిమానుల మదిలో వచ్చాయి.

కాగా ఈమధ్య మంచు మనోజ్ టాక్ షోలో మాట్లాడిన అడివి శేష్ వీరిద్దరి పరిచయం గురించి చెప్పదమే కాకుండా పవన్ కళ్యాణ్ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అసలు విషయానికి వస్తే వీళ్లిద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారట. వీరిద్దరూ ఒకేసారి వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడు అడివి శేష్ ని అకిరా కలుసుకున్నాడట. కాగా అప్పుడు అకిరా, అడివి శేష్‌తో.. ‘నాకు మీ సినిమాలంటే ఇష్టం’ అని చెబితే, అడివి శేష్, అకిరాతో.. నాకు మీ నాన్న సినిమాలు అంటే చాలా ఇష్టమని చెప్పారట. అప్పటినుంచి ఇద్దరు ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మాట్లాడుతూ ఉండేవారట. కాగా అకిరాకి మ్యూజిక్ పై చాలా ఇంట్రెస్ట్ ఉన్నదంతో.. అడివి శేష్ మూవీలోని సాంగ్ ని కంపోజ్ చేసి.. శేష్ కి సెండ్ చేశాడట. అలా జరిగిన దగ్గర నుంచి .. ఈ అబ్బాయి ఏంటి ఇంత స్వీట్ గా ఉన్నారు అనుకొని..శేష్.. అకిరాని ప్రేమించడం మొదలుపెట్టాడట. అప్పటినుంచి అకిరాకి ఒక అన్నయ్యగా వ్యవహరిస్తూ వస్తున్నారట.

ఈ క్రమంలో మంచు మనోజ్ టాక్ షోలో అడివి శేష్  “నీకు పవన్ కళ్యాణ్ అలానే అకిరాతో డైరెక్షన్ అవకాశం వస్తే..  ఎవర్ని సెలెక్ట్ చేసుకుంటావు..?” అని అడగగా.
 దానికి శేష్ సమాధానంగా.. “పవన్ గారు అంటే గౌరవం. కానీ అకిరా అంటే ప్రాణం. కాబట్టి అకిరాతోనే సినిమా చేస్తాను. పవన్ కి నో చెబుతాను” అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా అకిరా పై తనకున్న ప్రేమని కూడా తెలియజేశారు.

 

Also Read: Phone Addiction: ఇదేం విడ్డూరం.. చిన్నారిని ఆ పనిచేస్తూ ఫ్రిడ్జీలో పెట్టేసిన తల్లి.. వైరల్ వీడియో..

Also Read: Teen Girl reel At Airport: ఎయిర్ పోర్టులో యువతి రచ్చ.. లగేజీ ట్రాలీపై పడుకొని రీల్స్.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News