Shyam Singha Roy: భారీ ధరకు అమ్ముడైన 'శ్యామ్‌ సింగరాయ్‌' శాటిలైట్‌ రైట్స్‌..ఎంతో తెలుసా?

Shyam Singha Roy: నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తోన్న తాజా చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు సమాచారం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2021, 01:25 PM IST
Shyam Singha Roy: భారీ ధరకు అమ్ముడైన 'శ్యామ్‌ సింగరాయ్‌' శాటిలైట్‌ రైట్స్‌..ఎంతో తెలుసా?

Shyam Singha Roy: ‘ట్యాక్సీవాలాతో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్‌ సంకృత్యాన్‌(Director Rahul Sankruthyan) దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా నటిస్తున్న చిత్రం ‘శ్యామ్‌ 'సింగరాయ్‌'’(Shyam Singha Roy). సాయి పల్లవి(Sai Pallavi), కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌, జిషు సేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం డిసెంబరు 24న ప్రేక్షకుల మందుకు వస్తుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో..ఈనెల 14న వరంగల్‌లోని రంగలీల మైదానంలో ‘'శ్యామ్‌ సింగరాయ్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా’ జరపబోతున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 

Also Read: Pushpa Samanthas special song : 'మీ మగ బుద్దే.. వంకర బుద్ది' అంటున్న సామ్.. అల్లకల్లోలం చేసిన సమంత

అయితే '‘శ్యామ్ సింగరాయ్'’ సినిమా తెలుగు శాటిలైట్ హక్కుల(Telugu Satellite Rights)ను రూ. 10 కోట్లకు ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ దక్కించుకున్నట్లు సమాచారం. కాగా శాటిలైట్ హక్కుల పరంగా పరంగా నాని సినిమా కెరీర్‌లో ఇదే రికార్డ్‌ డీల్‌ అని విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. సను జాన్ వర్గీస్, నవీన్ నూలి వరుసగా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News