Akhil: అఖిల్ కి మొదలైన కొత్త తలనొప్పులు.. ఇంకా ఫైనల్ కాని నెక్స్ట్ ప్రాజెక్ట్..

Akhil Akkineni : ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి కనీసం ఒక్క సూపర్ హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయినా యువ హీరో అక్కినేని అఖిల్ ఈ మధ్యనే ఏజెంట్ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం గడిచింది కానీ ఇంకా అఖిల్ తన నెక్స్ట్ సినిమా విషయంలో కాన్ఫిడెంట్ గా అడుగులు ముందుకు వేయలేకపోతున్నారు అని తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2023, 05:40 PM IST
Akhil: అఖిల్ కి మొదలైన కొత్త తలనొప్పులు.. ఇంకా ఫైనల్ కాని నెక్స్ట్ ప్రాజెక్ట్..

Akhil Akkineni : అక్కినేని వారసుడిగా అక్కినేని అఖిల్ తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పటికే హీరోగా అరడజను సినిమాలు చేశాడు. కానీ ఒక్క సినిమాతో కూడా సూపర్ హిట్ ని అందుకోలేకపోయాడు. ఈ మధ్యనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.

ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత నుంచి అఖిల్ సినిమాలకి దూరంగా ఉంటున్నారు. తన నెక్స్ట్ సినిమా గురించి ఇప్పటిదాకా అప్డేట్ ఇవ్వలేదు. అసలైతే ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ అనే ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాలేదు. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు.

తాజా సమాచారం ప్రకారం అఖిల్ తన నెక్స్ట్ సినిమా విషయంలో ఇంకా మంచి నిర్ణయం తీసుకోలేకపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కినేని అభిమానులు కూడా కొంత కంగారు పడుతున్నారు. మరోవైపు అఖిల్ వేరే డైరెక్టర్ల నుంచి కొన్ని స్క్రిప్టులు వింటున్నట్టు తెలుస్తోంది. కానీ అందులో అఖిల్ ఏ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

ఏజెంట్ సినిమా అంత పెద్ద డిజాస్టర్ అవడంతో అఖిల్ తన నెక్స్ట్ సినిమా విషయంలో కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్లలేకపోతున్నారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏజెంట్ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని అఖిల్ గట్టిగా నమ్మారు కానీ సినిమా రిజల్ట్ మాత్రం అఖిల్ ని తీవ్ర నిరాశకి గురి చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అఖిల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో పాటు దసరా ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నుంచి రెండు కథలు విన్నట్లు తెలుస్తోంది. నాని హీరోగా నటించిన దసరా సినిమాతో శ్రీకాంత్ కూడా డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ ఇంకా శ్రీకాంత్ కాంబినేషన్ లో సినిమా అయితే బాగుంటుంది అని అభిమానులు కూడా అనుకుంటున్నారు. మరి అఖిల్ తన నెక్స్ట్ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇంకా వేచి చూడాల్సి ఉంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News