Akshay Kumar: ‘లక్ష్మీ బాంబ్‌’ టైటిల్‌ మార్చిన మూవీ యూనిట్

Akshay Kumar Laxmmi Movie | హారర్ కామెడీ మూవీతో బాలీవుడ్‌లో ప్రయోగానికి సిద్ధమయ్యాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్. అయితే సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్ష్మీ బాంబ్’పై వివాదం చెలరేగింది.

Last Updated : Oct 30, 2020, 01:38 PM IST
  • హారర్ కామెడీ మూవీతో బాలీవుడ్‌లో ప్రయోగానికి సిద్ధమయ్యాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్
  • విడుదలకు కొన్ని రోజుల ముందు లేటెస్ట్ మూవీ ‘లక్ష్మీ బాంబ్’పై వివాదం చెలరేగింది
  • ‘లక్ష్మి బాంబ్’ సినిమా టైటిల్‌ను ‘లక్ష్మి’ పేరుతో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది
Akshay Kumar: ‘లక్ష్మీ బాంబ్‌’ టైటిల్‌ మార్చిన మూవీ యూనిట్

టాలీవుడ్, కోలీవుడ్‌లో సక్సెస్ అయిన హారర్ కామెడీ మూవీతో బాలీవుడ్‌లో ప్రయోగానికి సిద్ధమయ్యాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar). అయితే సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్ష్మీ బాంబ్’ (Laxmmi Bomb)పై వివాదం చెలరేగింది. సినిమా టైటిల్స్‌పై వివాదాలు ఇదే కొత్త కాదు. గతంలో బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల సినిమాలపై వివాదాలు చెలరేగడం చివరి క్షణంలో పేరు మార్చడం జరిగాయి.

 

తాజాగా ఆ జాబితాలో అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘లక్ష్మీ బాంబ్‌’ చేరింది. రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్‌ సరసన కియారా అద్వాణీ కనిపించనున్నారు. సినిమా టైటిల్‌లో లక్ష్మీ అనే పేరు ఉందని, పవిత్రమైన పేరు అని.. లక్ష్మీదేవిని కించపరిచేలా ఉందని శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన సినిమా యూనిట్‌కు నోటీసులు పంపించింది. సినిమాకు ఎలాగూ కావల్సినంత ప్రచారం దక్కడంతో టైటిల్ మార్చేందుకు మూవీ యూనిట్ నిర్ణయం తీసుకుంది. 

 

ఈ నేపథ్యంలో ‘లక్ష్మి బాంబ్’ సినిమా టైటిల్‌ను ‘లక్ష్మి’ పేరుతో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. బాంబ్ అనే పదాన్ని తొలగించి సినిమా పేరునే లక్ష్మి అని నిర్ణయించారు. దీపావళి కానుకగా నవంబర్ 9న ఈ మూవీ ఓటీటీ వేదికగా డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌‌లో విడుదల కానుంది. నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తీసిన కాంచన సినిమాకు హిందీ రీమేక్ ఈ ‘లక్ష్మి’ మూవీ. దక్షిణాదికే పరిమితమైన ఈ ట్రెండ్‌నను బాలీవుడ్‌కు అగ్ర నటుడు అక్షయ్ కుమార్ పరిచయం చేస్తున్నారు.  Photos : Bigg Boss Telugu 4: కొత్త కెప్టెన్‌గా అరియానా.. ఫీల్ అవుతున్న లాస్య, హారిక 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News