Laxmmi Bomb Trailer: లక్ష్మణ్-లక్ష్మీ పాత్రల్లో అదరగొట్టిన అక్షయ్ కుమార్

బాలీవుడ్ ( Bollywood ) స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న లక్ష్మీ బాంబ్ ట్రైలర్ ( Laxmmi Bomb Trailer ) వచ్చేసింది. హార్రర్- కామెడీ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులకు మాంచి వినోదం గ్యారంటీ అంటోంది సినిమా టీమ్.

Last Updated : Oct 9, 2020, 02:16 PM IST
    • బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న లక్ష్మీ బాంబ్ ట్రైలర్ వచ్చేసింది.
    • హార్రర్- కామెడీ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులకు మాంచి వినోదం గ్యారంటీ అంటోంది సినిమా టీమ్.
    • ఈ ట్రైలర్ పూర్తిగా అక్షయ్ కుమార్ ఎనర్జీ, అద్భుతమైన నటనకు నిదర్శనం.
Laxmmi Bomb Trailer: లక్ష్మణ్-లక్ష్మీ పాత్రల్లో అదరగొట్టిన అక్షయ్ కుమార్

బాలీవుడ్ ( Bollywood ) స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న లక్ష్మీ బాంబ్ ట్రైలర్ ( Laxmmi Bomb Trailer ) వచ్చేసింది. హార్రర్- కామెడీ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులకు మాంచి వినోదం గ్యారంటీ అంటోంది సినిమా టీమ్. ఈ ట్రైలర్ పూర్తిగా అక్షయ్ కుమార్ ఎనర్జీ, అద్భుతమైన నటనకు నిదర్శనం. ఒక వైపు కామెడీ, మరోవైపు హారర్ రెండింటిలోనూ బ్యాలెన్స్ చేస్తూ నటించాడు. దాంతో పాటు ఇతర నటీనటులతో కలిసి మంచి పెర్ఫార్మెన్స్ చూపించాడు. 

ALSO READ|  IPL 2020: ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన ప్లేయర్స్ వీరే

లక్ష్మీ బాంబ్ చిత్రంలో కైరా అద్వానీ ( Kiara Advani ) హీరోయిన్ కాగా...అక్షయ్ కుమార్ డబుల్ రోల్ చేస్తున్నాడు. లవర్ బాయ్, లక్ష్మీ అనే ఆత్మ పాత్రలకు అక్షయ్ కుమార్ ( Akshay Kumar ) తన స్టైల్ జోడించి వినోదభరితమైన చిత్రంగా మార్చినట్టు ట్రైలర్ చూస్తోంటే అర్థం అవుతోంది.

లక్ష్మణ్ నుంచి లక్ష్మీ పాత్రలోకి క్షణాల్లో మారిపోతూ ఉండే అక్షయ్ ( Akshay Kumar ) నటనను చూస్తే కాంచనలో రాఘవ లారెన్స్ నటన గుర్తుకు వస్తోంది.  ఈ మూవీని లారెన్స్ తెరకెక్కిస్తున్నాడు.  ఈ చిత్రం 2020 నవంబర్ 9న విడుదల కానుంది. 

కొన్ని రోజుల క్రితం విడుదలైన లక్ష్మీ బాంబ్ మోషన్ పోస్టర్ మంచి విజయం సాధించింది. లక్షలాది మంది దీన్ని చూశారు. 24 గంటల్లోనే 21 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ALSO READ| Online Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News