Pushpa 2: పుష్ప2 ఖాతాలో రూ. వెయ్యి కోట్ల దుడ్డు.. నీ యవ్వ తగ్గేదేలే..!

Pushpa 2 1000 Crore Club: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 12, 2024, 12:15 AM IST
Pushpa 2: పుష్ప2 ఖాతాలో రూ. వెయ్యి కోట్ల దుడ్డు.. నీ యవ్వ తగ్గేదేలే..!

Pushpa 2 1000 Crore Club:పుష్ప 2 మూవీ ఖాతాలో తాజాగా వెయ్యి కోట్ల దుడ్డు చేరింది. అంతేకాదు ఈ సినిమా పూటకో రికార్డు బ్రేక్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అంతేకాదు వసూళ్లలో తాజాగా రూ. వెయ్యి కోట్ల అరుదైన క్లబ్బులో చేరింది. అంతేకాదు కేవలం ఆరు రోజుల్లో అత్యంత వేగంగా రూ. 1002 కోట్ల  గ్రాస్ క్లబ్బులో చేరిన సినిమాగా ‘పుష్ప 2’ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

అంతేకాదు పుష్ప-2 రికార్డులను అప్పడం నలిపేసిసట్టు రప్పారప్పా తిరగరాస్తోందని మూవీ టీమ్ తెలిపింది. హిందీలో కూడా రికార్డుల వేట కొనసాగిస్తోంది. హిందీలో తొలి అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఫాస్టెస్ట్ రూ. 100 కోట్ల నెట్.. రూ. 200 కోట్ల నెట్.. రూ. 300 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. 6 రోజుల్లో ఈ సినిమా అక్కడ రూ. 375 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ రోజుతో ఈ సినిమా బాలీవుడ్ లో రూ. 400 కోట్ల నెట్ వసూళ్లను క్రాస్ చేయడం గ్యారంటీ అని చెప్పొచ్చు. హిందీలో దాదాపు రూ. 600 కోట్ల నెట్ వసూళ్ల వరకు రాబట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఇక ఓవర్సీస్ లో కూడా పుష్ప 2 బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది.  వేగంగా రూ. 2వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు. వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ను నిలబెట్టుకుంటూ బాక్సాఫీస్ దగ్గర స్టడీగా సాగిపోతుంది. ఈ సినిమా అన్ని ఏరియాల్లో భారీ రేటుకు అమ్మారు.ఒక్క కర్ణాటకలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.

ఈ వీకెండ్ వరకు ఈ సినిమా హిందీలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే అవకాశాలున్నాయి. అక్కడ రూ. 450 కోట్ల నెట్ వసూళ్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నట్టు లెక్క. తెలుగులో ఇప్పటి వరకు  'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్', ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'  సినిమాలు మాత్రమే ఇప్పటివరకు వెయ్యి కోట్ల క్లబ్ లో ఉన్నాయి. ఫస్ట్ డే 294 కోట్లతో అత్యధిక కలెక్షన్ రాబట్టిన భారతీయ సినిమాగా పుష్ప-2 రికార్డులకు ఎక్కింది. ఇక తెలుగు కాకుండా కన్నడ నుంచి కేజీఎఫ్ 2 రూ. వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. అటు హిందీలో పఠాన్, జవాన్ చిత్రాలు రూ. వెయ్యి కోట్ల క్లబ్బులో ఎంట్రీ ఇవ్వడం విశేషం.

ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..

ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News