Pushpa 2: అదిరిన పుష్ప 2 ఫస్ట్ లిరికల్ షార్ట్ వీడియో.. పూర్తి పాట విడుదల అప్పుడే..

Pushpa 2 First Lyrical: పుష్ప సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఈ చిత్రం గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ తన ట్విట్టర్ లో ఇచ్చి ప్రేక్షకులను సంబరపరిచారు..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 24, 2024, 04:46 PM IST
Pushpa 2: అదిరిన పుష్ప 2 ఫస్ట్ లిరికల్ షార్ట్ వీడియో.. పూర్తి పాట విడుదల అప్పుడే..

Pushpa 2 First Lyrical Glimpse: పుష్ప రెండో భాగం గురించి తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ సినిమా విడుదల అవుతూ ఉండటంతో ఈ చిత్ర ప్రమోషన్స్ ఇటీవల టీజర్ విడుదలతో మొదలుపెట్టాడు సినిమా యూనిట్. గంగమ్మ జాతర లో పుష్ప ఫైట్ చూపించిన ఈ టీజర్ ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ లో దూసుకుపోతోంది.

ఈ క్రమంలో ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ ఇచ్చేశారు అల్లు అర్జున్. పుష్ప సినిమా ఫస్ట్ లిరికల్ పుష్ప పుష్ప అనే పాట మే 1న విడుదల అవ్వనుంది అని ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే ఇందులో ఆకట్టుకునే విషయం ఏమిటి అంటే ఈ పోస్టుతో పాటు ఈ పాట కి సంబంధించి ఈ పాట మొదటి లైన్ ఉందే షార్ట్ వీడియో ని కూడా షేర్ చేశారు. పుష్ప పుష్ప అనే లిరిక్స్ తో సాగి ఈ సాంగ్ మొదటి లైన్ వింటేనే ప్రేక్షకులకు తప్పకుండా ఈ సాంగ్ గూస్ బంప్స్ ఇవ్వనుంది అని అర్థం అయిపోతోంది.

 

ఇక ఈ చిన్న షార్ట్ వీడియోలో పుష్ప తనదైన స్టైల్ లో తగ్గేదేలే అంటూ కనిపించారు. ప్రస్తుతం ఈ పాటకి సంబంధించిన ఈ చిన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అల్లు అర్జున్ అభిమానులకు పుష్ప రెండో భాగంపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమాని నిర్మిస్తున్నారు. ఎన్నో రోజుల క్రితమే ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది అని సినిమా యూనిట్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఆ డేట్ కే ఫిక్స్ అయిపోయి ఆగస్టులో పుష్పన్ని రిలీజ్ చెయ్యడానికి సిద్ధమయ్యారు సినిమా యూనిట్. మరి ఈ చిత్రం కూడా మొదటి వార్తలానే బ్లాక్బస్టర్లు సాధిస్తుందా.. లేదా అంతకన్నా పెద్ద విజయం సాధిస్తుందో తెలియాలి అంటే అక్కడి వరకు వేచి చూడాలి.

Read More: Taslima Mohammad:సోషల్ మీడియాలో బిల్డప్ లు.. తస్లీమా మహమ్మద్ ఆస్తులు చూసి కళ్లు తేలేస్తున్న ఏసీబీ అధికారులు..

Read More: Smita Sabharwal: వరల్డ్ బుక్ డే... వైరల్ గా మారిన స్మితా సబర్వాల్ చేసిన లేటెస్ట్ ట్వీట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x