VI Anand: సందీప్ కిషన్ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా…క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

Allu Arjun: ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పుష్ప రెండో భాగం అయిపోగానే సందీప్ రెడ్డి వంగా తో తన తదుపరి చిత్రాన్ని కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వైరల్ అవుతుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2024, 07:00 AM IST
VI Anand: సందీప్ కిషన్ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా…క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

Allu Arjun Next: పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా అంటే తెలుగు ప్రేక్షకులే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పుష్ప సీక్వెల్ పుష్ప 2 పైన అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ఈ సంవత్సరం ఆగస్టున విడుదల కానుందని చిత్రమేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి వంగతో చేయనున్నట్లు గత కొద్దిరోజుల క్రితమే అఫీషియల్ గా చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు కాకుండా అల్లు అర్జున్ మరో సినిమా కూడా ఒప్పుకున్నారు అనే ఒక వార్త తెగ వైరల్ అయింది. టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక క్షణం.. డిస్కోరాజా.. లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు VI ఆనంద్. ఆయన తీసే సినిమాలు కొత్తగా అలానే చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ సందీప్ కిషన్ హీరోగా.. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా చేస్తున్న ఊరుపేరు భైరవకోన సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ సైతం ఈ చిత్రం ఆనంద్ టైప్ థ్రిల్లింగ్ సినిమాలానే ఉంటుంది అని రుజువు చేసి ప్రేక్షకులలో అంచనాలను పెంచింది.

ఈ సినిమా ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు VI ఆనంద్. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఈ దర్శకుడు పలు ఆసక్తికర విషయాలని తెలిపారు. ఈ నేపథ్యంలో గతంలో VI ఆనంద్ – అల్లు అర్జున్(Allu Arjun) కాంబోలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.. సినిమా ఉందా అని ఓ మీడియా ప్రతినిధి అడిగారు. కాగా దీనికి ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చారు ఆనంద్.

ఈ ప్రశ్నకు జవాబు ఇస్తూ ఆనంద్..’ అవును. నేను అల్లు అర్జున్ గారితో సినిమా చేయాల్సి ఉంది. కొన్ని కథలను ఆయనకు వినిపించాను. ఒక సైఫై కథని కూడా వినిపించాను. అయితే అల్లు అర్జున్ గారు ఇంకా కొంచెం పెద్ద కథ, ఆసక్తిగా ఉన్న కథ కావాలని అడిగారు. అప్పుడు నేను అలాంటి కథలు రాయలేదు. త్వరలో అల్లు అర్జున్ గారిని మళ్ళీ కలుస్తాను. ఆయనతో సినిమా భవిష్యత్తులో ఉండొచ్చు. ఊరుపేరు భైరవకోన తర్వాత గీత ఆర్ట్స్ లో నిఖిల్ తో ఒక సినిమా చేయబోతున్నాను’ అని చెప్పుకొచ్చారు. మొత్తం పైన ఈ మాటలతో ఈ దర్శకుడితో.. అల్లు అర్జున్ సినిమా త్వరలో ఉండబోతుంది అనే ఒక క్లారిటీ అయితే వచ్చింది. కానీ బన్నీకి తగిన కథ చెప్పి ఆనంద్ మెప్పించగలగతారా లేదా అనే సందేహం కూడా మొదలయింది.

Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌

Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం

 

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News