Allu Arjun: నోరు జారిన అల్లు అర్జున్.. పుష్ప -2 పై దెబ్బ పడనుందా..?

Allu Arjun controversial comments: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,సుకుమార్ దర్శకత్వంలో విడుదలకు ఉంచిన తాజా చిత్రం పుష్ప -2. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో దాదాపు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. రష్మిక మందన్న హీరోయిన్ గా, శ్రీ లీల ఐటమ్ సాంగ్ లో నర్తిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.  

Written by - Vishnupriya | Last Updated : Nov 11, 2024, 10:13 PM IST
Allu Arjun: నోరు జారిన అల్లు అర్జున్.. పుష్ప -2 పై దెబ్బ పడనుందా..?

Allu Arjun about National award: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప -2 సినిమాను  మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.  ఈనెల 17వ తేదీన బీహార్ రాజధాని పాట్నాలో.. భారీ స్థాయిలో ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి మరీ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను  విడుదల చేయబోతున్నట్లు తాజాగా పోస్టర్ తో సహా వెల్లడించారు. 

Add Zee News as a Preferred Source

మరోవైపు డిసెంబర్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే . ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆహా ఓటీటీ నిర్వహిస్తున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి ముఖ్యఅతిథిగా విచ్చేశారు అల్లు అర్జున్. 

ఈ నేపథ్యంలోనే ఆయన నోరు జారి అందరినీ ఆశ్చర్యపరిచారు.  అసలే విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో బన్నీ ఇలాంటి.. వ్యాఖ్యలు చేయడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇకపోతే ఈ షోలో జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు? అని బాలకృష్ణ అడగగా.. దానికి బన్నీ సమాధానం ఇస్తూ.. మన తెలుగు హీరోలు ఎవరికీ కూడా జాతీయ అవార్డు రాలేదని బాధ ఉండేది. దాన్ని ఎలాగైనా సరే కొట్టాలని.. రౌండప్ చేసుకున్నాను. ఇప్పుడు దానిని సాధించాను అంటూ తెలిపారు. అంతేకాదు మన తెలుగు హీరోలు ఎవరికీ జాతీయ అవార్డు రాలేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు అల్లు అర్జున్. 

అయితే గతంలో జాతీయ అవార్డు వచ్చినందుకు సంతోషం, ఆనందంతో పాటు షాక్ కి గురయ్యాయని గతంలో తెలిపాడు. అప్పటివరకు తెలుగు హీరోల్లో నాలుగైదుగురికి అవార్డు వచ్చి ఉంటుందని,  తాను నాలుగోవాడినో, 5వ వాడినో అయి ఉంటాను అనుకున్నానని అప్పుడు తెలిపారు. అయితే ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

ముఖ్యంగా తెలుగు హీరోలకు ఎవరికీ జాతీయ అవార్డు రాలేదని తాను మాత్రమే జాతీయ అవార్డు దక్కించుకున్నాను అనే రేంజ్ లో అల్లు అర్జున్ ప్రవర్తిస్తున్నాడు అంటూ మెగా అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  ఇక ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ అభిమానులు ఇలాంటి సమయంలో ఈ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more: KTR VS CM Revanth Reddy: రేవంత్ ఒక చిచోరా సీఎం.. మళ్లీ రెచ్చిపోయిన కేటీఆర్..ఏమన్నారంటే..? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News