Sai Dharam Tej Marriage: 'సుప్రీమ్' హీరో పెళ్లిపై హింట్‌ ఇచ్చిన అల్లు శిరీష్‌

Sai Dharam Tej: సుప్రీమ్‌ హీరో సాయిధరమ్  తేజ్ పెళ్లి వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇటీవల యాక్సిడెంట్ నుంచి కోలుకుని..సరిగ్గా అతడి పుట్టినరోజున డిశ్చార్జ్ అయ్యాడు తేజ్. ఇప్పడు మళ్లీ ఆయన వివాహ ప్రస్తావన అల్లు శిరీష్ లేవనెత్తడం వైరల్ గా మారింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2021, 04:38 PM IST
Sai Dharam Tej Marriage: 'సుప్రీమ్' హీరో పెళ్లిపై హింట్‌ ఇచ్చిన అల్లు శిరీష్‌

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారా? బ్యాచులర్‌ లిస్ట్‌ నుంచి త్వరలోనే తప్పుకోనున్నారా అనే అనుమానం మెగా అభిమానుల్లో కలుగుతోంది. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సాయితేజ్‌(Sai Dharam Tej) పూర్తిగా కోలుకొని విజయ దశమి సందర్భంగా హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే అదేరోజు సాయి తేజ్‌ పుట్టిరోజు(Sai Dharam Tej Birth Day) కూడా ఉండటంతో మెగా ఫ్యామిలీ(Mega family)లో ఆనందం మరింత రెట్టింపయ్యింది. 

Also Read; Pelli sandaD: పెళ్లిసందD శ్రీలీల నా కూతురు కాదు..నా భార్య కూతురు

ఈ సందర్బంగా తేజ్‌ కజిన్స్‌ అతనికి వెల్‌కం హోం అంటూ బర్త్‌డే విషెస్‌(Birthday wishes)ను తెలిపారు. ఇందులో సుష్మిత కొణిదెల, శ్రీజ, నిహారిక, అల్లు శిరీష్‌ సహా మిగతా కజిన్స్‌ సైతం తేజ్‌కు ఎంతో ప్రేమగా విషెస్‌ చెప్పారు. అయితే శిరీష్‌(Allu Sirish) మాట్లాడుతూ.. సింగిల్‌గా ఇదే నీ చివరి బర్త్‌డే అవ్వాలనుకుంటున్నా. ఈ మ్యారేజ్‌ రేస్‌లో నువ్వు నన్ను బీట్‌ చెయ్యాలనుకుంటున్నా అని సాయి తేజ్‌ పెళ్లిపై హింట్‌ ఇచ్చేశాడు. దీంతో ఇప్పటికే సంబంధాలు చూస్తున్నారని, త్వరలోనే సాయి తేజ్‌ పెళ్లిపై క్లారిటీ రానుందని మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ఇటీవల ‘రిపబ్లిక్’(Republic Movie) మూవీతో హిట్ కొట్టిన సాయిధరమ్ తేజ్.. ప్రస్తుతం తన కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ పెడుతున్నారు. మరి ఆయన పెళ్ళి వార్తల్లోని నిజానిజాలేంటో చూడాలి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News