HHVM Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయిన సినిమాలలో ఒకటి హరిహర వీరమల్లు. చిత్ర నిర్మాత ఏ ఏం రత్నం కోసం అయినా పవన్ కళ్యాణ్ ఈ సినిమాని పూర్తి చేయాలని అనుకుంటున్నారు కానీ అది మాత్రం జరగటం లేదు. ఇదిలా ఉండగా తాజాగా సినిమాకి దర్శకత్వం వహించాల్సిన క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నారు.
ఎన్నికల హడావిడిలో ఈ విషయం పెద్దగా హైలైట్ అవ్వలేదు కానీ చాలామంది అభిమానులు మాత్రం ఈ విషయంలో బాగా హర్ట్ అయ్యారు. తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడం పై చిత్ర నిర్మాత ఏ.ఏం.రత్నం క్లారిటీ ఇచ్చారు.
అందరికీ సర్దుబాటు కావాలనే ఉద్దేశంతో మాత్రమే క్రిష్ డైరెక్షన్ నుంచి తప్పుకున్నారని తన బదులుగా జ్యోతి కృష్ణ.. ఇప్పుడు సినిమాకి దర్శకత్వం వహిస్తారని తెలియజేశారు. జ్యోతి కృష్ణ ఎవరో కాదు.. స్వయంగా ఏ ఏం రత్నం కొడుకే. ఇప్పటికే కథ, స్క్రీన్ ప్లే మీద బాగా పట్టు ఉండడం, స్వతహాగా తాను, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ డైరెక్షన్లో అనుభవం ఉండటం వల్ల జ్యోతి కృష్ణ కి ఎటువంటి గైడెన్స్ కావాలన్నా తాము ఇవ్వగలమని చెప్పుకొచ్చారు ఏ ఏం రత్నం. మొత్తానికి ఇలా క్రిష్ ఆ తర్వాత జ్యోతి కృష్ణ..ఎ.ఎం.రత్నం.. పవన్ కళ్యాణ్.. ఇలా నలుగురు చేతిలో ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలు పడడం గమనర్హం.
ఇదంతా బాగానే ఉంది కానీ సినిమా కథ, స్క్రీన్ ప్లే మీద పట్టు ఉండటం గురించి పక్కన పెడితే జ్యోతి కృష్ణ కి దర్శకత్వం మీద ఎంత పట్టు ఉందో ఎవరికీ తెలియదు. పోనీ ఏ.ఏం.రత్నం ట్రాక్ రికార్డు చూసినా కూడా మలయాళం సినిమా రీమేక్.. పెద్దరికం.. తప్ప పెద్ద చెప్పుకోదగ్గ హిట్లు కూడా ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ కూడా జానీ సినిమాతో డైరెక్టర్ గా ట్యాగ్ అయితే తెచ్చుకున్నారు.. కానీ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మరి ఇలాంటి ఇద్దరు డైరెక్టర్లు, అసలు డైరెక్షన్ అనుభవమే లేని జ్యోతి కృష్ణ చేతిలో.. హరిహర వీరమల్లు సినిమా ఏమైపోతుందో అని అభిమానులు కంగారుపడుతున్నారు. ఈ హడావిడిలో ఫ్యాన్స్ కి.. ఊరట కలిగించిన ఒకే ఒక్క విషయం సినిమా ఈ ఏడాది విడుదలవుతుంది అని ఏ ఏం రత్నం నొక్కి చెప్పడం. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్యనే జరిగిన ఎన్నికల్లో కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ రాజకీయాలతోనే బిజీ అయిపోతారు. ఉన్న కాస్త సమయం కూడా ఓజీ సినిమా షూటింగ్ కి సరిపోతుంది. మరి అలాంటిది పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం సమయాన్ని కేటాయించగలరో లేదో ఇంకా వేచి చూడాలి.
Also Read: NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
Also Read: Lucknow: తాగడానికి ఒప్పుకోలేదని దారుణం.. టెర్రస్ పై నుంచి తోసేసిన మందు బాబులు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter