Amaran movie controversy: మేజర్ ముకుంద్ వరద రాజన్ ఆర్మీ అధికారి జీవిత చరిత్ర ఆధారంగా అమరన్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో.. శివకార్తీకేయర్ హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా నేపథ్యంలో అనేక వివాదాలు తెరమీదకు వచ్చాయి. గతంలో సాయి పల్లవి ఇండియన్ ఆర్మీని పాక్ .. ఆర్మీతో పొలుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండియన్ ఆర్మీపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి... ఆర్మీకి చెందిన అధికారి భార్యగా ఎలా చేస్తావని కూడా నెట్టింట సాయిపల్లవిపై దారుణంగా ట్రోల్స్ చేశారు.
అదే విధంగా సాయి పల్లవి ఇండియన్ ఆర్మీకి సారీ చెప్పాలని కూడా డిమాండ్ లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో సాయి పల్లవి ఫోన్ నంబర్ అంటూ ఒక నంబర్ ను చూపించారు. అది కాస్త నిజమనుకుని.. చాలా మంది దానికి ఫోన్ లు చేశారంట. అది ఇంజనీరింగ్ విద్యార్థి అయిన విఘ్నేషన్ ది అంట. అయితే.. అతను అమరన్ సినిమా టీమ్ కు పలు మార్లు తన నంబర్ ను తీసేయాలని కూడా చెప్పారంట. కానీ అమరన్ టీమ్ మాత్రం పట్టించుకోలేనట్లు తెలుస్తొంది.
దీంతో ప్రతిరోజు వందలాది కాల్స్ తో విద్యార్థి చాలా డిస్టర్బ్ అయ్యాడంట. చేసేది లేక.. చివరకు.. మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. తనకు రూ. 1. 1 కోట్లు నష్టపరిహాం ఇవ్వాలని కూడా సినిమా టీమ్ కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది. దీంతో కోర్టు దీనిపై కౌంటర్ వేయాలని నోటీసులు జారీ చేసిందంట. ఈ నేపథ్యంలో ప్రస్తుతం.. అమరన్ మూవీ టీమ్ ఫోన్ నంబర్ ఘటనలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తొంది.
అంతేకాకుండా.. ఈ సినిమాలో హే మిన్నలే.. పాటలో .. ఉన్న ఫోన్ నంబర్ ను బ్లర్ చేసినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. యూట్యూబ్ లో సైతం.. పాటలో ఈ ఫోన్ నంబర్ ను పూర్తిగా కన్పించకుండా.. బ్లర్ చేసినట్లు తెలుస్తొంది. దీంతో ఆ నంబర్ పూర్తిగా కన్పించ కుండా పోయిందని చెప్పుకొవచ్చు. మరీ అమరన్ టీమ్.. విద్యార్థి నంబర్ కన్పించకుండా చేశారు కాబట్టి.. అతని రూ. కోటి డిమాండ్ నుంచి తప్పించుకున్నట్లేనా..లేదో మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారిందని చెప్పుకొవచ్చు.
Read more: అవుతున్న నెటిజన్లు.. వీడియో ఇదే..
ఈ క్రమంలో నెటిజన్లు మాత్రం.. ఆ విద్యార్థి చెప్పగానే.. నంబర్ అప్పుడు బ్లర్ ఎందుకు చేయలేదని.. అతను కోర్టువరకు వస్తే కానీ.. చేయరా.. అంటూ ఫైర్ అవుతున్నారంట. అతను పడ్డ మానసిన వేదనకు నష్టపరిహారం ఏమిస్తారని కూడా మండిపడుతున్నారంట. ఈ క్రమంలో దీనిపై కోర్టు, సదరు బాధిత విద్యార్థి ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.