Anjali Arora Tollywood Entry: తెలుగు సినిమాలో హీరోయిన్ గా కచ్చా బాదం భామ.. ఎవరి పక్కనో తెలుసా..?

Anjali Arora Tollywood Entry With Navin:  కచ్చా బాదాం సాంగ్ కి డ్యాన్స్ చేసి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అంజలి అరోరా ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 4, 2023, 04:08 PM IST
Anjali Arora Tollywood Entry: తెలుగు సినిమాలో హీరోయిన్ గా కచ్చా బాదం భామ.. ఎవరి పక్కనో తెలుసా..?

Anjali Arora Tollywood Entry Fixed: ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా హీరోయిన్లుగా మారిన వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో అలాగే తమిళ సినీ పరిశ్రమలో కూడా ఇలా సోషల్ మీడియా ద్వారా ఫ్రేమ్ తెచ్చుకుని హీరోయిన్లుగా మారిన వారు ఇప్పుడు హీరోయిన్లతో మారి పోతున్నారు. మృణాళిని రవి, బ్రిగిడా సాగా, సంచిత బసు, అనంతికా సనీల్ కుమార్ వంటి వారికి అవకాశాలు దక్కగా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకున్న మరో భామ టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.  

అసలు విషయం ఏమిటంటే నవీన్ పోలిశెట్టి హీరోగా కొన్ని రోజుల క్రితం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ భార్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్న ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ గత ఏడాది  ఓ టీజర్ సైతం రిలీజ్ చేశారు. ఆ టీజర్ లో నవీన్ పోలిశెట్టి తన డైలాగ్స్, కామెడీతో నవ్వించారు. ఆ టీజర్ లో ఆయన రాజు గాడి పెళ్లి అదిరిపోవాలంటూ హడావిడి చేస్తూ కనిపించార.

'అనగనగా ఒక రాజు' అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన ఈ సినిమాలో డీజే టిల్లు భామ నేహా శెట్టి ఒక హీరోయిన్గా, అంజలి అరోరా మరో హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం. ఈ అంజలి అరోరా ఎవరు అంటే గుర్తుపట్టడం కష్టమే కానీ కచ్చా బాదం అంటూ పింక్ కలర్ డ్రెస్ తో డాన్స్ చేసిన భామ అంటే సోషల్ మీడియా వాడే వారందరికీ వెంటనే గుర్తువచ్చేస్తుంది.

అలా కచ్చా బాదం అనే ఒక బెంగాలీ వీధి వర్తకుడి నోటి పాట ద్వారా ఫేమస్ అయిన ఈ భామ ఆ మధ్య కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరించిన లాకప్ అనే రియాలిటీ షోలో కూడా కనిపించే అవకాశం దక్కించుకుంది, ఇక ఇప్పుడు ఆ భామ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమా ద్వారా నవీన్ పోలిశెట్టి సరసన ఆమె హీరోయిన్గా నటించబోతోంది.
Also Read: Manchu Brothers Fight: మంచు విష్ణు-మనోజ్ గొడవలో ట్విస్ట్.. జనాన్ని బకారాల్ని చేశారు మావా!

Also Read: Costumes Krishna Death: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

Trending News