Geethanjali Malli Vachindi: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.. అంజలి కొత్త సినిమా పోస్టర్ రిలీజ్

Geethanjali Malli Vachindi First Look: హర్రర్ కామెడీ బ్యాక్‌ డ్రాప్‌లో ఆడియన్స్‌ను భయపెడుతూ నవ్వించిన గీతాంజలి మూవీకి సీక్వెల్ రాబోతుంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంటూ హీరోయిన్ అంజలి సందడి చేయనుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేడు విడుదల చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2024, 06:38 PM IST
Geethanjali Malli Vachindi: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.. అంజలి కొత్త సినిమా పోస్టర్ రిలీజ్

Geethanjali Malli Vachindi First Look: హీరోయిన్ అంజలి మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతోంది. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ పోస్టర్‌ను న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేశారు. అంజలి టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. మలయాళ నటుడు రాహుల్ మాధవ్ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. గీతాంజలి మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముక రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో MVV సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ  ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అంజలి కెరీర్‌లో ఇది 50వ సినిమా కావడం విశేషం. హారర్ కామెడీ జోనర్‌లో గీతాంజలి సూపర్ హిట్‌గా నిలవడంతో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీపై అంచనాలు నెలకొన్నాయి.  

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక పోస్టర్ విషయానికి వస్తే.. పాడుబడ్డ బంగ్లాలో నాట్య కళాకారిణి లుక్‌లో అంజలి కనిపిస్తోంది. పోస్టర్‌ను చూస్తుంటే.. సరికొత్త కథ, కథనంతో మూవీని డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీని తెలుగుతోపాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గీతాంజలి మూవీ ఎక్కడ ఆగుతుందో అక్కడి నుంచి సీక్వెల్‌ మొదలవుతుందని మేకర్స్ తెలిపారు. పార్ట్‌-1 కీలక పాత్రులు పోషించిన శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు సీక్వెల్‌లో స‌త్య‌, సునీల్‌, ర‌విశంక‌ర్‌, శ్రీకాంత్ అయ్యంగార్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషించనున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన హార‌ర్ కామెడీ సినిమాలన్నీ ఒక ఎత్తైతే ‘గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది’లో హార‌ర్ కామెడీ వాట‌న్నింటినీ మించేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.

నిన్ను కోరి, నిశ్శ‌బ్దం సినిమాల‌కు కొరియోగ్రాఫర్‌గా వ్యవమరించిన శివ తుర్ల‌పాటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కోన వెంక‌ట్‌ కథ అందిస్తుండగా.. మాట‌లు భాను భోగవరపు, నందు సవరిగాన రాశారు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు మ్యూజిక్ అందించారు. కెమెరామెన్‌గా సుజాత సిద్ధార్థ్ వ్యవహరిస్తుండా.. ఎడిటింగ్ బాధ్యతలను చోటా కె ప్ర‌సాద్‌ నిర్వర్తిస్తున్నారు.

Also Read: Ys Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిబ్రవరి 17న, ప్రకటించిన వైఎస్ షర్మిల

Also Read: Redmi Note 13 Pro 5G: Redmi Note 13 సిరీస్‌ మొబైల్స్‌ల ధరేంతో తెలుసా? లీక్‌ అయిన ధర, ఫీచర్స్‌ వివరాలు! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News