Geethanjali Malli Vachindi Review: క్రైమ్ థ్రిల్లర్ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'.. ఊహించని ట్విస్టులతో మైండ్ బ్లాక్

Geethanjali Malli Vachindi Movie Review and Rating: హర్రర్, కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో అంజలి ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 11, 2024, 02:36 PM IST
Geethanjali Malli Vachindi Review: క్రైమ్ థ్రిల్లర్ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'.. ఊహించని ట్విస్టులతో మైండ్ బ్లాక్

Geethanjali Malli Vachindi Movie Review and Rating: 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' అంటూ ప్రేక్షకులను మళ్లీ భయపెట్టేందుకు వచ్చేసింది హీరోయిన్ అంజలి. ఆమె ప్రధాన పాత్రలో పదేళ్ల క్రితం వచ్చిన హారర్ కామెడీ సినిమా ‘గీతాంజలి’కి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. శివ తుర్లపాటి దర్శకత్వం వహించగా.. MVV సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందింది.  నేడు (ఏప్రిల్ 11) థియేటర్స్‌లోకి ఈ సినిమా వచ్చింది. మరోసారి 'గీతాంజలి'కి ప్రేక్షకులు భయపడ్డారా..? క్రైమ్ థ్రిల్లర్ కమ్ కామెడీ మెప్పించిందా..? రివ్యూలో చూద్దాం పదండి.

కథ:

పార్ట్ 1 చివర్లో గీతాంజలి (అంజలి) దెయ్యం నుంచే స్టోరీ మొదలవుతుంది. ఓ ఆఫీస్‌లో ఒకరు చనిపోవడంతో అక్కడ దెయ్యం ఉందని.. కొంతమందిని పిలిపించి గీతాంజలి ఆత్మను ఓ బొమ్మలో బంధిస్తారు. జాగ్రత్తగా ఊరి చివరలో పాతిపెడతారు. అయితే కొన్నాళ్లకు బయటకు వచ్చి.. వెంకట్రావు (అలీ) చేతికి దొరుకుతుంది. పార్ట్ 1లో సినిమా తీసి హిట్ కొట్టిన శ్రీను(శ్రీనివాస్ రెడ్డి).. వరుసగా మూడు ఫ్లాప్‌ సినిమాలు తీసి ఉంటాడు. దీంతో సినీ అవకాశాలు లభించక కష్టాలు పడుతుంటాడు.

తన ఫ్రెండ్ అయాన్ (సత్య)ను హీరోను చేస్తానంటూ డబ్బులు తీసుకుని మోసం చేస్తాడు. అయాన్ హైదరాబాద్‌కి రావడంతో వీళ్ల మోసం తెలిసిపోతుంది. అదే టైమ్‌లో శ్రీనుకి ఊటీ నుంచి ఫోన్ వస్తుంది. విష్ణు (రాహుల్ మాధవ్) అనే వ్యక్తి మేనేజర్ కాల్ చేసి కొత్త సినిమా తీద్దాం.. ఊటీకి రావాలని పిలుస్తాడు. పార్ట్ 1లో గీతాంజలి చెల్లి అంజలి (అంజలి డ్యూయల్ రోల్) ఊటీలో కాఫీ షాప్ రన్ చేస్తుంటుంది. శ్రీనుకి సినిమా ఛాన్స్ ఇచ్చిన విష్ణు.. అక్కడ ఉన్న భూత్ బంగ్లా సంగీత్ మహల్‌లోనే చిత్రీకరించాలని.. అంజలినే హీరోయిన్‌గా తీసుకోవాలని కండీషన్స్ పెడతారు. 

ఆ మహాల్‌లో శాస్త్రి (రవిశంకర్), భార్య (ప్రియా), ఆయన కూతురు దెయ్యాలుగా తిరుగుతుంటారు. సంగీత్ మహల్ స్టోరీ ఏంటి..? అందులోని దెయ్యాల కథేంటి..? శ్రీనుని పిలిపించి మరీ విష్ణు మూవీ ఛాన్స్ ఎందుకు ఇచ్చాడు..? ఆ సినిమాలో అంజలినే హీరోయిన్‌గా తీసుకోవాలని, సంగీత్ మహాల్‌లోనే షూటింగ్ చేయాలని ఎందుకు కండీషన్స్ పెట్టాడు..? మరీ చివరకు సినిమా తీశారా..? గీతాంజలి ఆత్మ ఉన్న బొమ్మ ఏమైంది..? గీతాంజలి ఆత్ మళ్ళీ వచ్చిందా..? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ:

గీతాంజలి సినిమాలో ఆడియన్స్‌ను భయపెడుతూనే.. చక్కటి కామెడీతో హిట్ కొట్టారు. పార్ట్‌లో కూడా హార్రర్, కామెడీ రెండు అంశాలను చక్కగా రాసుకున్నారు. సినిమా అంతా నవ్విస్తునే.. మధ్య మధ్యలో భయపెట్టేశారు. ప్రథమార్థం వరకు సినిమా కష్టాలు, సంగీత్ మహల్, దెయ్యాలు కథ చెబుతూ.. ఇంటర్వెల్‌కు ముందు అదిరిపోయే ట్విస్ట్‌తో థ్రిల్‌కు గురిచేశారు. సెకండాఫ్‌లో దెయ్యాలతో షూటింగ్ చేస్తూ నవ్విస్తారు. క్లైమాక్స్‌లో మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోయాయి. గీతాంజలికి సీక్వెల్ పర్ఫెక్ట్‌ సెట్ అయింది. రెండు సినిమాలకు కనెక్షన్‌ ఉంటుంది.

ఎవరు ఎలా నటించారు..?

అంజలి రెండు క్యారెక్టర్స్‌లో సూపర్‌గా యాక్ట్ చేసింది. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, జబర్దస్త్ అవినాష్, పవిత్ర తమ కామెడీ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించారు. రవిశంకర్, ప్రియా దెయ్యాలుగా నటించి మెప్పించారు. విలన్‌గా మలయాళ నటుడు రాహుల్ మాధవ్ పర్వాలేదనిపించాడు. దిల్ రాజు, బీవీఎస్ రవి, సురేష్ కొండేటి గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.
 
సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్‌గా తీశారు. ఊటీ లొకేషన్స్‌ బ్యూటీఫుల్‌గా చూపించారు. సాంగ్స్ ఓకే అనిపించినా.. బీజీ మాత్రం పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. స్క్రీన్‌ ప్లే ఎక్కడా బోర్ కొట్టదు. తన తొలి సినిమాతోనే డైరెక్టర్ శివ తుర్లపాటి మంచి మార్కులు కొట్టేసి సక్సెస్ అయ్యాడు. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.

రేటింగ్: 3/3

Also Read: Kurnool News: ఉగాది వేడుకల్లో ఊహించని విషాదం.. 15 మంది పిల్లలు సీరియస్..

Also Read: Samsung Galaxy S24 FE Price: సాంసంగ్‌ నుంచి అదిపోయే న్యూస్‌.. త్వరలోనే మార్కెట్‌లోకి Galaxy S24 FE మొబైల్‌..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News