AP Tickets Issue: ఏపీ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల కీలక భేటీ, ప్రభాస్, రాజమౌళి, ఎన్టీఆర్, మహేశ్ బాబు సహా...

AP Tickets Issue: ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల ధరలు, ఇతర అంశాలపై ఇవాళ స్పష్టత రానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సినీ ప్రముఖుల కీలక భేటీ ఇవాళ జరగనుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 10, 2022, 07:56 AM IST
AP Tickets Issue: ఏపీ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల కీలక భేటీ, ప్రభాస్, రాజమౌళి, ఎన్టీఆర్, మహేశ్ బాబు సహా...

AP Tickets Issue: ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల ధరలు, ఇతర అంశాలపై ఇవాళ స్పష్టత రానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సినీ ప్రముఖుల కీలక భేటీ ఇవాళ జరగనుంది. 

ఏపీలో గత కొద్దికాలంగా నెలకొన్న సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయాలు, టికెట్ ధరల విషయంపై ఇవాళ అత్యంత కీలకమైన భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సినీ ప్రముఖులు పెద్దఎత్తున సమావేశం కానున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా చిరంజీవి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఓ దఫా సమావేశమయ్యారు. ఆ సమావేశం అనంతరం అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నానంటూ చెప్పారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై నియమించిన కమిటీ రూపొందించే ముసాయిదా నివేదికపై అభిప్రాయం కోసం తనకు పంపుతానన్నారని చిరంజీవి చెప్పారు. 

ఈ వ్యవహారాన్ని త్వరగా ముగించాలనే ఆలోచనతో మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశం కానున్నారు. సినీ పరిశ్రమ నుంచి ఎక్కువమంది ముఖ్యమంత్రిని కలవాలని కోరుకోగా, కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో తక్కువమందికి అనుమతించామని మంత్రి పేర్నినాని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో ఇవాళ సినీ ప్రముఖులు నాగార్జున, మహేశ్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, కొరటాల శివ వంటి పెద్దలు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు వెళ్తున్నారు.ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. ముఖ్యమంత్రి నివాసంలో సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ ధరలపై చర్చించి ..లంచ్ అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు. స్టార్ హీరోలంతా ముఖ్యమంత్రి జగన్‌ను (Ap cm ys jagan) కలిసేందుకు వెళ్తుండటంతో ఈ సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుంది. 

Also read: Sai Chand Villain in Salar: ప్రభాస్‌ మూవీలో విలన్‌గా ఫిదా, ఉప్పెన ఫేమ్ సాయి చంద్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News