Ar Rahman on keeravani: అన్నీ వదిలేద్దాం అనుకున్నాకే అంతా మొదలైంది.. రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ar Rahman on MM keeravani: సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తెలుగు సంగీత దర్శకుడు కీరవాణి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 28, 2023, 05:49 PM IST
Ar Rahman on keeravani: అన్నీ వదిలేద్దాం అనుకున్నాకే అంతా మొదలైంది.. రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ar Rahman on MM keeravani: ఎంఎం కీరవాణి ఈ మధ్య అనూహ్యంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి మ్యూజిక్ అందించిన కీరవాణి కీర్తి ఒక్కసారిగా ప్రపంచ స్థాయికి చేరింది. ఆయన సంగీతం అందించిన నాటు నాటు సాంగ్ ఆస్కార్లో ఒరిజినల్ బెస్ట్ స్కోర్ కేటగిరీలో నామినేట్ అవ్వడంతో పాటు ఆ తరువాతి రోజే ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేయడం కూడా ఆయనను వార్తల్లో నిలిచేలా చేసింది.

ఈ నేపథ్యంలో కీరవాణి గురించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా కీరవాణి గురించి ఆస్కార్ ఇప్పటికే అందుకున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంఎం కీరవాణి గారు చాలా గొప్ప సంగీత దర్శకుడు కానీ ఆయనకు తగినంత ప్రాధాన్యత దక్కలేదని రెహమాన్ అన్నారు. ప్రాధాన్యత దక్కకపోవడంతో 2015 వ సంవత్సరంలో కీరవాణి సంగీతం నుంచి దూరం కూడా అవ్వాలనుకున్నాడు.

ఆయన తన సంగీత కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నాడు కానీ అలా అనుకున్నప్పటి నుంచే ఆయన కెరీర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఒక రకంగా పూర్తిస్థాయిలో ఆయన సినిమాలు అప్పటి నుంచి ప్రేక్షకులకు దగ్గర అవడం మొదలయ్యాయి అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు మనకు ఆయన ఏంటో తెలిసింది అందుకే జీవితం ముగిసిపోతుందని భావించిన వారు ఖచ్చితంగా జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించాలి.

నేను నా స్టూడెంట్స్ కి ఎప్పుడూ ఇదే విషయం చెబుతాను అంటూ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంటే కెరియర్ ముగిసిపోతుంది కదా అని సైలెంట్ అవ్వకూడదని మనం చేయాల్సిన పని మనం చేస్తూ ఉన్నప్పుడు అంతా మంచే జరుగుతుందని అర్థం వచ్చేలా రెహమాన్ కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Nandamuri Taraka Ratna Health: అత్యంత విషమంగా తారక రత్న ఆరోగ్య పరిస్థితి.. బులెటిన్లో ఏముందంటే?

Also Read: Srinivasa Murthy Death: శ్రీనివాసమూర్తి గుండెపోటుతో చనిపోలేదా.. పైనుంచి కింద పడి చనిపోయాడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News