అరవింద సమేత ట్రైలర్ అదుర్స్ : ఎస్ఎస్ థమన్

అరవింద సమేత ట్రైలర్‌పై అంచనాలు పెంచిన థమన్ ట్వీట్

Last Updated : Sep 29, 2018, 01:47 PM IST
అరవింద సమేత ట్రైలర్ అదుర్స్ : ఎస్ఎస్ థమన్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డె జంటగా తెరకెక్కిన అరవింద సమేత సినిమా అక్టోబర్ 2న ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరుపుకోనుండగా తాజాగా ఆ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఎస్ఎస్ థమన్ మరో ఆసక్తికరమైన విషయాన్ని ఎన్టీఆర్ అభిమానులకు వెల్లడించాడు. అరవింద సమేత చిత్ర దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి ట్రైలర్‌కి స్కోర్ కంపోజ్ చేస్తుండగా తీసుకున్న ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన థమన్.. తనకు ఇష్టమైన ప్రియమైన దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి ట్రైలర్ స్కోర్ సందర్భంగా తీసుకున్న ఫోటో ఇది అని పేర్కొన్నాడు. అంతేకాకుండా "ట్రైలర్ ఈజ్ రాకింగ్ గైస్.." అంటూ ఎన్టీఆర్ అభిమానులను ఊరిస్తూ ఇదే ట్వీట్‌లో మరో కామెంట్ చేశాడు. ఇప్పటికే అరవింద సమేత ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ అభిమానుల్లో ఎస్ఎస్ థమన్ చేసిన ఈ ట్వీట్ మరిన్ని అంచనాలు పెంచినట్టయింది.

 

Trending News