Bigg Boss Telugu 4: అక్కడ పొర్లాడి ఏడిస్తే.. ఇక్కడ భారీ మైలేజ్!

Bigg Boss Telugu 4: అతిపెద్ద తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4 దాదపుగా క్లైమాక్స్ దశకు చేరుకుంది. బిగ్‌బాస్ తెలుగు 4లో ఇప్పటివరకూ టాప్ 5లో ఇద్దరు చోటు దక్కించుకున్నారు. అఖిల్ సార్థక్, ఇస్మార్ట్ సోహైల్ ఇద్దరూ బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే చేరుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ వారం తొలుత సోహైల్‌ను సేవ్ చేయడం వెనుక పెద్ద స్టోరీనే ఉంది.

Last Updated : Dec 13, 2020, 02:57 PM IST
Bigg Boss Telugu 4: అక్కడ పొర్లాడి ఏడిస్తే.. ఇక్కడ భారీ మైలేజ్!

Ariyana vs Sohel Bigg Boss Telugu 4: అతిపెద్ద తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4 దాదపుగా క్లైమాక్స్ దశకు చేరుకుంది. బిగ్‌బాస్ తెలుగు 4లో ఇప్పటివరకూ టాప్ 5లో ఇద్దరు చోటు దక్కించుకున్నారు. అఖిల్ సార్థక్, ఇస్మార్ట్ సోహైల్ ఇద్దరూ బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే చేరుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాస్ 4 తెలుగు 14వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. అయితే ఈవారం కొత్త విధానానికి బిగ్‌బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున శ్రీకారం చుట్టారు.

ప్రతివారం ఒక్కో కంటెస్టెంట్‌ను సేవ్ చేసేవారు. ఈవారం ఒక్కో కంటెస్టెంట్‌ను టికెట్ టు ఫినాలేకి పంపుతూ Bigg Boss Telugu 4 టాప్ 5 కంటెస్టెంట్స్‌ను రివీల్ చేయనున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఈ క్రమంలో టాప్1గా నిలిచిన అఖిల్‌తో ఓ ఫొటో ఆవిష్కరింపచేయడంతో సోహైల్ టాప్ 2 కంటెస్టెంట్‌గా నిలిచాడు. తన ఫొటో చూసుకోగానే టాప్ 5లో చేరిన బిగ్‌బాస్ తెలుగు 4 కంటెస్టెంట్ సోహైల్ ఆనందంతో చిన్నపిల్లాడిలా ఎగిరి గంతులేశాడు. గట్టిగట్టిగా అరుస్తూ తన భావోద్వేగాన్ని నియంత్రించకునేందుకు యత్నించాడు.

Also Read: Solar Eclipse 2020: ఈ రాశులవారిపై సూర్యగ్రహణం ప్రభావం! 

కాగా, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన అభిజిత్, దేత్తడి హారికలలో ఒకరు మొదటగా సేవ్ అవుతారని బిగ్‌బాస్ తెలుగు 4 ప్రేక్షకులు, నెటిజన్లు భావించారు. అయితే అనూహ్యంగా ఈ వారం తొలుత సోహైల్‌ను సేవ్ చేయడం వెనుక పెద్ద స్టోరీనే ఉంది. తనను సేవ్ చేయమని ప్రేక్షకులను కోరేందుకు సోహైల్‌కు గోల్డెన్ మైక్ రావడంతో.. ఓట్లను రిక్వెస్ట్ చేసే పనిలో అతడు బిజీగా ఉన్నాడు. అతడు మైక్ తీసుకుని అలా రూములోకి వెళ్లాడో లేదో ఇక్కడ గట్టిగా అరుస్తూ బాత్రూమ్‌లో నేలమీద పడి అరియానా ఏడవటం మొదలుపెట్టింది. తోటి కంటెస్టెంట్స్ అఖిల్, హారిక, మొనాల్ ఓదార్చినా వినకుండా అతియానాలా ప్రవర్తించిందని బిగ్ బాస్ 4 ప్రేక్షకులు గుర్తించారు.

Also Read: Interesting Facts About Moles: మచ్చలపై ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

అరియానా కావాలనే చేసిందని భావించిన ప్రేక్షకులు తమ గేర్ మార్చారు. అందులోనూ ఆడ, మగ అంటూ కార్డ్ ప్లే చేసి నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేందుకు అరియానా యత్నించడంతో .. అంతే వేగంతో సోహైల్‌కు ఓట్లు వేశారు. తప్పుచేయని సోహైల్ ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని భావించిన బిగ్ బాస్ 4 ప్రేక్షకులు తమ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో అందించగా సేవ్ అయ్యాడు. దీంతో కింగ్ నాగార్జున తొలుత సోహైల్‌ను గ్రాండ్ ఫినాలేకు పంపించారు. శనివారం ఎపిసోడ్‌లో సైతం అరియానా చేసిన తప్పులను ఎత్తిచూపారు నాగ్. ఉద్దేశపూర్వకంగానే చేశావని వ్యాఖ్యానించకపోయినా, ఎందుకు చేసిందో ప్రేక్షకులకు తెలిసేలా చేశారు. మరోవైపు ఆవేశాన్ని నియంత్రణలో ఉంచుకోలేని సోహైల్‌కు మరోసారి క్లాస్ పీకారు నాగార్జున.

Also Read: Solar Eclipse 2020 Date and Timings: చివరి సూర్యగ్రహణం.. భారత్‌లో  పరిస్థితి ఏంటంటే! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News