Sandeep Vanga: అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో ఆ లక్కీ ఛాన్స్ ఎవరికో ?

అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga ) తన తదుపరి చిత్రాన్ని త్వరలో ప్రకటించబోతున్నట్లు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Last Updated : Sep 1, 2020, 02:05 AM IST
Sandeep Vanga: అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో ఆ లక్కీ ఛాన్స్ ఎవరికో ?

అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga ) తన తదుపరి చిత్రాన్ని త్వరలో ప్రకటించబోతున్నట్లు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తదుపరి చిత్రం ఒక క్రైమ్ స్టోరీ నేపథ్యంలో ఉంటుందని హింట్ ఇచ్చిన సందీప్.. ఆ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ కూడా దాదాపు పూర్తయిందని పేర్కొన్నాడు. త్వరలోనే ఆ సినిమాపై ఓ అధికారిక ప్రకటన సైతం చేయనున్నట్లు తెలిపాడు. టి సిరీస్‌తో కలిసి తానే ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు చెప్పిన సందీప్ వంగ.. అప్పటికి ఇంకా హీరో ఖరారు కాలేదని అన్నాడు. Also read : Radhe Shyam shooting: ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్‌లో ఇటలీకి ప్రభాస్ అండ్ టీమ్ ?

Sandeep Reddy Vanga ఈ ప్రాజెక్ట్ కోసం గతంలో టాలీవుడ్‌లో మహేష్ బాబు, రామ్ చరణ్,  ప్రభాస్‌లను ( Prabhas ) అలాగే బాలీవుడ్‌లో రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి స్టార్ హీరోలను కలిసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ వాళ్లెవరు కూడా ఈ ప్రాజెక్ట్‌ని ఓకే చేయలేదనే టాక్ కూడా వినిపించింది. దీంతో సందీప్ రెడ్డి వంగా తన క్రైమ్ థ్రిల్లర్‌లో ప్రధాన పాత్ర పోషించడానికి కొత్త వారిని హీరోగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మూవీ లాంచ్ రోజున ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు తెలుస్తాయి. Also read : Akshay Kumar: డిస్కవరీ చానెల్ లో బేర్ గ్రిల్స్ తో అక్షయ్ కుమార్

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం.. 

Trending News