Aryan Khan, Sadia Khan: పాకిస్తాన్ నటితో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఫోటో వైరల్

Aryan Khan With Pakistani Actress Sadia Khan: ఆర్యన్ ఖాన్‌తో పాకిస్థాన్ నటి సదియా ఖాన్ చొరవగా తీసుకున్న ఫోటోను తన సోషల్ మీడీయా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసుకుంది. మామూలుగానే ఆర్యన్ ఖాన్ ఏ హీరోయిన్‌తో కలిసి కనిపించినా ఆమె వెంటనే వార్తల్లోకెక్కుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2023, 08:07 PM IST
Aryan Khan, Sadia Khan: పాకిస్తాన్ నటితో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఫోటో వైరల్

Aryan Khan With Pakistani Actress Sadia Khan: బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పాకిస్థాన్ నటితో కలిసి పార్టీ చేసుకోవడం ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. స్టార్ సెలబ్రిటీలతో పాటు వారి పిల్లల కదలికలపై కూడా మీడియా ఎప్పుడూ ఓ నజర్ పెట్టే ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. స్టార్ కిడ్స్ దేశంలో ఉన్నా.. విదేశాల్లో ఉన్నా.. వారి కదలికలపై ఎప్పుడూ నిఘా ఉంటుంది. అలాగే తాజాగా ఆర్యన్ ఖాన్ దుబాయ్‌లో ఓ పాకిస్తాన్ నటితో పార్టీ చేసుకోవడం బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

ఆర్యన్ ఖాన్‌తో పాకిస్థాన్ నటి సదియా ఖాన్ చొరవగా తీసుకున్న ఫోటోను తన సోషల్ మీడీయా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసుకుంది. మామూలుగానే ఆర్యన్ ఖాన్ ఏ హీరోయిన్‌తో కలిసి కనిపించినా ఆమె వెంటనే వార్తల్లోకెక్కుతోంది. అలాంటిది ఈసారి ఆర్యన్‌తో కలిసి కనిపించిన హీరోయిన్ పాకిస్థానీ అవడంతో ఈ ఫోటో మరింత వైరల్ అవుతోంది. దుబాయ్‌లో కరణ్ జోహర్, అనన్య పాండే, నోరా ఫతేహి, సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్ న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడే పాకిస్థాన్ నటి సదియా ఖాన్ ఆర్యన్ ఖాన్‌తో కెమెరాకు ఫోజిచ్చినట్టు తెలుస్తోంది.

ఇటీవల ఆర్యన్ ఖాన్‌కి నోరా ఫతేహికి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందంటూ రూమర్స్ గుప్పుమన్నాయి. వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని.. మీడియా కంట పడకుండా చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఈ రూమర్స్‌పై అటు ఆర్యన్ ఖాన్ కానీ లేదా నోరా ఫతేహీ కానీ.. ఈ ఇద్దరిలో ఎవ్వరూ స్పందించలేదు. మరోవైపు ఆర్యన్ ఖాన్‌కి అనన్యా పాండేకు ముడిపెడుతూ గతంలోనే కథనాలొచ్చాయి. అనన్యా పాండే మరో అడుగు ముందుకేసి కాఫీ విత్ కరణ్ షోలో మాట్లాడుతూ.. తనకు ఆర్యన్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు పాకిస్థాన్ నటి సదియా ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇలా ఆర్యన్ ఖాన్ ఎవరితో కనిపిస్తే వారితో అతడికి ముడిపెడుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎప్పుడూ తెరపడేనో మరి.

ఇది కూడా చదవండి : Naresh, Pavitra Lokesh: నరేష్ - పవిత్ర లోకేష్ పెళ్లి.. ఆ వార్తల్లో నిజం లేదన్న రమ్య రఘుపతి.. జీ మీడియాకు ఎక్స్‌క్లూజీవ్‌ ఇంటర్వ్యూ

ఇది కూడా చదవండి : Suhana Khan dating Agastya Nanda: అమితాబ్ బచ్చన్ మనవడితో లవ్‌లో పడిన షారుఖ్ ఖాన్ కూతురు ?

ఇది కూడా చదవండి : Aryan Khan, Nora Fatehi: ఏజ్‌లో తనకంటే పెద్ద హీరోయిన్‌తో షారుఖ్ ఖాన్ కుమారుడు డేటింగ్ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News