Aryan Khan, Nora Fatehi in Relationship ?: షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ సినిమాల్లోకి రాకముందే స్టార్ కిడ్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఆర్యన్ ఖాన్‌కి ముఖ్యంగా ఫీమేల్ ఫాలోయింగ్ భారీగా ఉంది. ఆర్యన్ ఖాన్ ఎక్కడుంటే అక్కడ గాళ్స్ అతడి చుట్టూ చేరడం అనేక పార్టీల్లో, సెలబ్రిటీ ఈవెంట్స్‌లో చూస్తూనే ఉన్నాం. ముంబైలో భారీ నౌకలో పార్టీ చేసుకుంటున్న సమయంలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ సేవించాడంటూ వివాదంలో చిక్కుకోవడంతో కొన్నాళ్లు జైళ్లో కూడా ఉండి వచ్చాడు. అయినప్పటికీ ఆర్యన్ ఖాన్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. త్వరలోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు.
షారుఖ్ ఖాన్‌కి సినీరంగ వారసుడిగా ఆర్యన్ ఖాన్ త్వరలోనే ఒక వెబ్‌సిరీస్ ద్వారా తొలిసారిగా ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం తన డెబ్యూ వెబ్ సిరీస్‌కి కథని సిద్ధం చేసుకుంటున్నాడు.
ఇదిలావుంటే, తాజాగా ఆర్యన్ ఖాన్ డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లోకెక్కాడు. ఆర్యన్ ఖాన్ డేటింగ్ రూమర్స్ అంటే ఎవరైనా ఏం అనుకుంటారు.. ఏ స్టార్ హీరో కూతురితోనో లేక స్టార్ హీరోయిన్ కూతురితోనో డేటింగ్‌లో ఉండి ఉంటాడు అనుకుంటారు కదా.. అది కూడా కాదంటే ఎవరైనా వెరీ యంగ్ హీరోయిన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు అనుకుంటారు. కానీ ఆర్యన్ ఖాన్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాలీవుడ్‌లో ఫేమస్ హీరోయిన్స్‌లో ఒకరైన నోరా ఫతేహితో డేటింగ్ చేస్తున్నట్టు వార్తల్లోకెక్కాడు. ఆర్యన్ ఖాన్, నోరా ఫతేహి.. ఇద్దరూ కూడా ఒకే అభిమానితో ఫోటోకు ఫోజిచ్చారు. ఆ ఫోటోను రెడిట్‌లో షేర్ చేసుకున్నారు.
ఆ ఫోటోలు చూసిన నెటిజెన్స్ తమకు తోచినట్టు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని.. విదేశాల్లో కలిసి షికార్లు కొడుతున్నారని అనుమానం వ్యక్తంచేస్తూ ఆ ఇద్దరికి లింకప్ చేసేశారు. అంతేకాదు.. నోరా ఫతేహి ఎప్పటి నుంచో సినిమాలు చేస్తోంది. వయస్సులోనూ ఆర్యన్ ఖాన్ కంటే పెద్దది. ఆర్యన్ ఖాన్ వయస్సు 25 ఏళ్లు కాగా.. నోరా ఫతేహి ఆ నెంబర్ క్రాస్ చేసి ఐదేళ్లయింది. అలాంటిది ఈ ఇద్దరి మధ్య డేటింగ్ ఏంటి అని నోరెళ్లబెడుతున్న వాళ్లు కూడా లేకపోలేదు.
అర్జున్ కపూర్, మలైకా అరోరా జంట డేటింగ్‌లో ఉన్నప్పుడు వీళ్ల డేటింగ్ కూడా పెద్ద ఆశ్చర్యం ఏం ఉందనేది ఇంకొంతమంది అభిప్రాయం.
ఇదిలావుంటే, కొంతమంది నెటిజెన్స్ మాత్రం పాపం అనన్యా పాండే గతి ఏం కాను అంటూ ఆమె పట్ల దయ, జాలి వ్యక్తంచేశారు. అందుకు కారణం అనన్య పాండేకు ఆర్యన్ ఖాన్ పై క్రష్ ఉండటమే. ఈ విషయాన్ని స్వయంగా తానే చెప్పింది. కరణ్ జోహర్ హోస్ట్ చేసిన కాఫి విత్ కరణ్ షోలో అనన్యా పాండే మాట్లాడుతూ.. తనకు ఆర్యన్ ఖాన్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే, ఒకవేళ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, నోరా ఫతేహిపై ఇష్టం పెంచుకుని అనన్యా పాండేను దూరం పెడితే ఆమె పరిస్థితి ఏం కాను అనేది వారి అభిప్రాయం.
ఇది కూడా చదవండి : Pathaan Movie Controversy: పాకిస్థాన్ ఆల్బం నుంచి బాలీవుడ్ కాపీ కొట్టిందా ?
ఇది కూడా చదవండి : Urfi Javed : తప్పతాగి ఫుల్ చిల్ అయిన ఉర్ఫీ.. చివరగా చేసిన మంచి పని అదేనట
ఇది కూడా చదవండి : Sreemukhi Pics : మరీ తగ్గించేస్తోందిగా.. బుల్లి గౌనులో బుల్లితెర రాములమ్మ.. శ్రీముఖి పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook