Naresh, Pavitra Lokesh: నరేష్ - పవిత్ర లోకేష్ పెళ్లి.. ఆ వార్తల్లో నిజం లేదన్న రమ్య రఘుపతి.. జీ మీడియాకు ఎక్స్‌క్లూజీవ్‌ ఇంటర్వ్యూ

Naresh's Wife Ramya Raghupathi Exclusive Interview: నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి వ్యవహారంపై మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే విషయమై రూమర్స్‌కి తెర దించుతూ వాస్తవాలను వెలికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మా జీ తెలుగు న్యూస్ ప్రతినిధి రమ్య రఘుపతిని సంప్రదించి అసలు వాస్తవాలను రాబట్టారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 06:39 PM IST
Naresh, Pavitra Lokesh: నరేష్ - పవిత్ర లోకేష్ పెళ్లి.. ఆ వార్తల్లో నిజం లేదన్న రమ్య రఘుపతి..  జీ మీడియాకు ఎక్స్‌క్లూజీవ్‌ ఇంటర్వ్యూ

Naresh's Wife Ramya Raghupathi Exclusive Interview: సీనియర్ హీరో నరేష్, నటి పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎప్పటి నుంచో మీడియాలో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఒకానొక దశలో వీళ్లు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారనే పుకార్లు కూడా షికార్లు చేశాయి. అయితే ఇద విషయంపై నరేష్ భార్య రమ్య రఘుపతి ఆగ్రహంతో ఉన్నారని.. తమ విడాకుల కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉండగానే వాళ్లు పెళ్లి ఎలా చేసుకుంటారని ఆమె మండిపడుతున్నట్టుగా మీడియాలో, సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతోంది. నరేష్, పవిత్ర లోకేష్ ఎలా పెళ్లి చేసుకుంటారో నేనూ చూస్తానని రమ్య రఘుపతి సవాల్ చేసినట్టుగా ఆ వార్తా కథనాలు స్పష్టంచేస్తున్నాయి.

ఇక ఇదే విషయమై రూమర్స్‌కి తెర దించుతూ వాస్తవాలను వెలికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా జీ తెలుగు న్యూస్ ప్రతినిధి రమ్య రఘుపతిని సంప్రదించగా.. ఆమె ఈ వార్తలను కొట్టిపారేశారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందునే ప్రస్తుతం తాను మీడియా ముందుకు రావడం లేదన్న రమ్య రఘుపతి.. నరేష్, పవిత్ర లోకేష్ ఎలా పెళ్లి చేసుకుంటారో చూస్తానని తాను సవాల్ చేసినట్టుగా మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని అన్నారు. తన తల్లి ఆరోగ్యం కుదుటపడ్డాకా తానే మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తానని నరేష్ భార్య రమ్య రఘుపతి స్పష్టంచేశారు. 

నరేష్‌తో డైవర్స్ కేసు కోర్టులో విచారణలో ఉన్న మాట వరకు వాస్తవమే కానీ.. నరేష్ - పవిత్ర లోకేష్‌ల పెళ్లి గురించి తాను ఎక్కడా, ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తేల్చిచెప్పారు. తనని సంప్రదించకుండానే ఎవరికి తోచినట్టుగా వాళ్లు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారని రమ్య రఘుపతి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం తాను ఆస్పత్రిలో తన తల్లి బాగోగులు చూసుకుంటున్నానని.. ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాకా మీడియాకు అసలు వాస్తవాలు చెబుతానని నరేష్ భార్య రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు. మొత్తానికి నరేష్, పవిత్ర లోకేష్‌ల పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ అయికూర్చుంది.

ఇది కూడా చదవండి : Suhana Khan dating Agastya Nanda: అమితాబ్ బచ్చన్ మనవడితో లవ్‌లో పడిన షారుఖ్ ఖాన్ కూతురు ?

ఇది కూడా చదవండి : Aryan Khan, Nora Fatehi: ఏజ్‌లో తనకంటే పెద్ద హీరోయిన్‌తో షారుఖ్ ఖాన్ కుమారుడు డేటింగ్ ?

ఇది కూడా చదవండి : Tollywood Sankranthi Winners: 2018 నుంచి 2022 టాలీవుడ్ సంక్రాంతి మొనగాళ్లు వీరే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x