Ashu Reddy : పవన్ కళ్యాణ్‌ కోసం అంతా పోగొట్టుకుందట.. అయినా ఎప్పుడూ బాధపడలేదట.. అషూ రెడ్డి పోస్ట్ వైరల్

Ashu Reddy Lost Her Job అషూ రెడ్డికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అషూ రెడ్డి తన ఒంటి మీద పవన్ కళ్యాణ్‌ పేరుని పచ్చబొట్టుగా పొడిపించుకున్న విషయం తెలిసిందే. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 11:18 AM IST
  • పవన్ కళ్యాణ్‌ సినిమా కోసం అషూ పిచ్చి పని
  • కాటమరాయుడు ప్రీమియర్‌ కోసం అషూ అలా
  • జాబ్ కోల్పోవడంతో కష్టాల్లో అషూ రెడ్డి
Ashu Reddy : పవన్ కళ్యాణ్‌ కోసం అంతా పోగొట్టుకుందట.. అయినా ఎప్పుడూ బాధపడలేదట.. అషూ రెడ్డి పోస్ట్ వైరల్

Ashu Reddy Lost Her Job  అషూ రెడ్డికి పవన్ కళ్యాణ్‌ అంటే పిచ్చి అభిమానం. ఓ భక్తురాలిగా పవర్ స్టార్‌ను ఆరాధిస్తుంటుంది. పవన్ కళ్యాణ్‌ అంటే అషూ రెడ్డి పడి చస్తుంటుంది. అలాంటి అషూ రెడ్డి పవన్ కళ్యాణ్ కాటమరాయుడి సినిమా కోసం పెద్ద సాహసమే చేసింది. కాటమరాయుడు సినిమా ప్రీమియర్ చూసేందుకు ఆఫీస్‌కు లీవ్ పెట్టిందట. దీంతో ఆమెను ఉద్యోగంలోంచి పీకేశారట. దీంతో కష్టాలన్నీ అనుభవించాల్సి వచ్చింది. కుటుంబం నుంచి కూడా కష్టాలను ఎదుర్కొందట. అయినా ఏనాడు కూడా రిగ్రెట్ ఫీల్ కాలేదట.. ఆయనకు భక్తురాలిని అవ్వడం ఎంతో గర్వంగా ఉందంటూ.. అషూ రెడ్డి చెప్పుకొచ్చింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

ఇక అషూ రెడ్డి చేసిన నాటి మెయిల్‌ను ఇప్పుడు షేర్ చేసింది. దీంట్లో ఉన్న తప్పులను నెటిజన్లు లెక్కిస్తున్నారు. అది నిజంగానే పంపావా? డ్రాఫ్ట్‌లోనే ఉంది కదా? దానికి ఏం రిప్లై వచ్చింది? అసలు ఇది నిజమేనా? అంటూ ఇలా పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అషూ రెడ్డి పిచ్చి ప్రేమను చూసి పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతోన్నారు.

అసలే పవన్ కళ్యాణ్ మీద పీకల్లోతు ప్రేమతో ఉంటుంది అషూ రెడ్డి. ఆ మధ్య పవన్ కళ్యాణ్‌ను హరి హర వీరమల్లు సినిమా సెట్‌లో కలవడం, కాసేపు మాట్లాడటం, ఓ రెండు గంటలు గడపడం తన జీవితంలో మరిచిపోలేని విషయాలను అని అషూ రెడ్డి చెబుతూ ఎమోషనల్ అయింది. ఇక అషూ రెడ్డి తన ప్రైవేట్ పార్ట్‌ల్లో పవన్ కళ్యాణ్‌ టాటూ వేయించుకోవడం, వాటిని ప్రదర్శించడంతో సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటుంది.

అషూ రెడ్డి ప్రస్తుతం ఇక్కడ లేదు. అమెరికా, ఆస్ట్రేలియా అంటూ తిరిగేస్తోంది. ఆమె చేతిలో ప్రస్తుతం ఏ షో కూడా లేదు. సినిమాల్లో అవకాశాలు కూడా అంతగా రావడం లేదు. ఈ మధ్యే ఓ సినిమాలో హీరోయిన్‌గా అషూ ఎంపికైంది. అయితే ఇంతకు ముందు ఫోకస్ అనే చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. కానీ ఈ సినిమా వచ్చినట్టు పోయినట్టు ఎవ్వరికీ తెలియకుండానే పోయింది.

Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?

Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News