Ashwini Dutt: ఆ నిర్మాతలను టార్గెట్ చేస్తూ అశ్వినీదత్ సంచలనం.. సహకరించే వాడికి కానంటూ కామెంట్స్!

Ashwini Dutt Sensational Comments Targetting Tollywood Producers: తెలుగు సినీ నిర్మాతలలో ఒక నలుగురిని అశ్వినీదత్ టార్గెట్ చేస్తూ మాట్లాడడం కలకలం రేపుతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2022, 03:25 PM IST
Ashwini Dutt: ఆ నిర్మాతలను టార్గెట్ చేస్తూ అశ్వినీదత్ సంచలనం.. సహకరించే వాడికి కానంటూ కామెంట్స్!

Ashwini Dutt Sensational Comments Targetting Tollywood Producers: థియేటర్ల వ్యవస్థ మీద సినీ నిర్మాత అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సీతారామం అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన తాజాగా ఆలీతో సరదాగా అనే షోలో పాల్గొన్నారు. ఈ టీవీలో ప్రసారం కాబోతున్న ఈ షోకి సంబంధించిన ఒక ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ఆలీ ఓటీటీలు థియేటర్ల మనుగడకి పెనుముప్పుగా సంభవించాయని నమ్ముతున్నారా అని ప్రశ్నించగా ఆయన ఓటీటీ కాదని ఇప్పటికే యూట్యూబ్ ఆ స్థానాన్ని ఆక్రమించిందని చెప్పుకొచ్చారు.

ఆలీతో సరదాగా షోలో గనుక అశ్వినీదత్ అలాగే ఆలీ కొట్టుకున్నారని వార్త రాస్తే యూట్యూబ్లో మిగతా పనులన్నీ పక్కనపెట్టి ఆ వీడియో చూస్తారని అంతలా ప్రజలు ఇలాంటి గాసిప్స్ యూట్యూబ్ లో వినడానికి చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాక సినిమా షూటింగ్స్ నిలిచిపోవడం మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే సినిమాల థియేటర్లకు ప్రేక్షకులకు రావడం లేదంటున్నారని కానీ థియేటర్లన్నీ ఒక ముగ్గురు, నలుగురు నిర్మాతలు చేతిలోనే పెట్టుకుంటున్నారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి తెలుగులో చిన్న నిర్మాతలు ఈ వ్యాఖ్యలు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు.

దిల్ రాజు, ఏషియన్ సునీల్, సురేష్ బాబు, అల్లు అరవింద్ వంటి వారు థియేటర్లు మొత్తం తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారని చిన్న సినిమాలకు థియేటర్లో దొరకకుండా వారు కావాలనుకున్న సినిమాలు మాత్రమే థియేటర్లలో ఆడేలా ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా వారిని మాఫియా అంటూ అశ్వినీదత్ సంబోధించడం కలకలం రేపుతోంది. నిజానికి అశ్వినీదత్ ఆ ఇంటర్వ్యూలో ఎవరి పేర్లూ వెల్లడించలేదు కానీ ఈ నలుగురు గురించే ఆయన మాఫియా అనే పదం వాడి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ ఇప్పటికే 55% పూర్తయిందని ప్రస్తుతానికి తాము ఇంకా కొత్త షెడ్యూల్ ప్లాన్ చేయలేదని అన్నారు. ఒకవేళ షెడ్యూల్ గనుక ప్లాన్ చేసి ఉంటే ఎలాంటి బంద్ నడుస్తున్నా షూటింగ్స్ చేయవద్దని కోరినా తాను తన సినిమా షూటింగ్ చేసుకునే వాడినని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. మరి ఆయన వ్యాఖ్యల మీద ఇండస్ట్రీ తరపున గాని సదరు నిర్మాతల తరఫున గాని ఎవరైనా స్పందిస్తారా లేదా అనే అంశం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read: Jalsa: థియేటర్లలో సందడి చేయనున్న జల్సా.. 4K క్వాలిటీతో సంజయ్ సాహో రీఎంట్రీ!

Also Read: Macherla Niyojakavargam: ఊహించని విధంగా మాచర్ల నియోజకవర్గం మొదటి రోజు కలెక్షన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News