SKN: తెలుగులో చిన్న సినిమాలతో పెద్ద హిట్స్ అందుకున్ నిర్మాతగా SKN పేరు టాలీవుడ్లో మార్మోగుతోంది. ప్రతి రోజు పండగే, ట్యాక్సీ వాలా, బేబి వంటి బ్లాక్ బస్టర్, కల్ట్ సినిమాలతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. SKN తన స్నేహితుడు, స్టార్ డైరెక్టర్ మారుతితో కలిసి మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటించిన తమిళ మూవీ లవర్ ను "ట్రూ లవర్" పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. విభిన్న ప్రేమ కథతో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. "ట్రూ లవర్" సినిమాను ఈ నెల 10వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాలోని కొన్ని హైలైట్స్ ఏంటో మీడియాకు తెలిపారు నిర్మాత ఎస్ కేఎన్.
ఈ సందర్భంగా SKN మాట్లాడుతూ మాది చిన్న సినిమా. చిన్న రిలీజ్. ఈగిల్ తో పోటీ పడే పెద్ద సినిమా కాదన్నారు. అయినా హంబుల్ గా అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న నిర్ణయాన్ని తీసుకుని ఈ నెల 10వ తేదీన 'ట్రూ లవర్' రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'రాజా సాబ్' సినిమాను మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఆ టీమ్ లో నేనూ ఉన్నానన్నారు నిర్మాత SKN. ఆ సంస్థ మా ఫ్రెండ్లీ బ్యానర్ లాంటిదే. చిన్నా, పెద్దా అన్ని సినిమాలు బాగుండాలి. అన్ని సినిమాలు సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. అప్పుడే ఎక్కువమంది టెక్నీషియన్స్ కు పని దొరుకుతుందన్నారు.
టూ లవర్ సినిమాను ఓ కామన్ ఫ్రెండ్ మారుతికి నాకు చెప్పారు. ఆయన కోరికపై సినిమా చూసి రైట్స్ తీసుకున్నాము. దీన్ని 'బేబి' సినిమాతో పోల్చలేము. రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్. నా మొదటి ప్రియారిటీ స్ట్రెయిట్ సినిమాలే. కంటెంట్ ఉంటే మంచి సినిమాలను రీమేక్ కాకుండా డైరెక్ట్ డబ్ చేయడం మేలు అన్నారు.
ఏ రిలేషన్ లోనైనా నమ్మకం అనేది పునాదిగా ఉంటుందన్నారు. "ట్రూ లవర్" సినిమాలో మెయిన్ పాయింట్ అదే. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా స్ట్రైకింగ్ గా అనిపించాయి. అవి చూసే సినిమా సక్సెస్ ను బిలీవ్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాను.
గీతగోవిందం, ట్యాక్సీ వాలా...ఒక్కో సినిమాకు ఒక్కో రేంజ్ ఉంటుంది. కానీ రెండు సూపర్ హిట్ సినిమాలే. సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా మంచి సక్సెస్ సాధించింది. నేను మారుతి గారితో కలిసి చేసిన ఈ రోజుల్లో కూడా యూత్ ఫుల్ మూవీ. పెద్ద స్టార్స్ తో సినిమాలు చేస్తే దాని బడ్జెట్ ఎక్కువ కాబట్టి మేకింగ్ కు మేము ప్రిపేర్ కావాలి. కొత్త వాళ్లతో మూవీ చేసినప్పుడు కంటెంట్ యూత్ ఫుల్ గా ఉంటే ఆ సినిమాల రీచ్ బాగుంటుంది. నెక్ట్ నేను చేస్తున్న నాలుగు సినిమాల్లో మూడు యూత్ ఫుల్ సినిమాలున్నాయి. ఒకటి సైన్స్ ఫిక్షన్ కంటెంట్‌తో ఔట్ ఆఫ్ ది బాక్స్ గా ఉంటుందన్నారు.
ఇక బేబి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాము. మరో రెండు రోజుల్లో అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తున్నాము. ఇప్పటికే 'కల్ట్ బొమ్మ' అనే టైటిల్ రిజిస్టర్ చేసాము. హిందీ స్టార్ కిడ్స్‌తో సాయి రాజేశ్ ఈ సినిమాను హిందీలో డైరెక్ట్ చేయనున్నారు. అర్జున్ రెడ్డి తెలుగులో కంటే హిందీ రీమేక్ కబీర్ సింగ్ అక్కడ మంచి వసూళ్లను సాధించింది. బేబి సినిమా కూడా అదే తరహాలో నడుస్తుందనే నమ్మకం ఉందన్నారు. ప్రొడ్యూసర్‌గా అప్పర్ ప్రైమరీ స్థాయిలో ఉన్నాను. కాలేజ్ స్టేజ్ వచ్చాకా అల్లు అర్జున్‌తో సినిమాను నిర్మిస్తాను.
ఇదీ చదవండి: Ruchaka Rajyog 2024: రుచకరాజ్యయోగం ఈరాశికి ప్రత్యేకం.. మార్చిలోగా కొత్త ఉద్యోగం, కాసులవర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook