Akhanda Dubbed Release Date: మరో నాలుగు భాషల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన అఖండ మూవీ

Akhanda Dubbed Release Date: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'అఖండ'. గతేడాది డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచి ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు మరో నాలుగు భాషల్లో రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 04:55 PM IST
    • మరో నాలుగు భాషల్లో విడుదల కానున్న అఖండ సినిమా
    • శుక్రవారం తమిళ డబ్ వర్షెన్ ను రిలీజ్ చేయనున్న చిత్రబృందం
    • కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు
Akhanda Dubbed Release Date: మరో నాలుగు భాషల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన అఖండ మూవీ

Akhanda Dubbed Release Date: నందమూరి బాలకృష్ణ.. ద్విపాత్రాభినయంలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'అఖండ'. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. బ్లాక్ బాస్టర్ టాక్ తో ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత జనవరి 21న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. డిజిటల్ వేదికలోనూ రికార్డులను కొల్లగొడుతోంది. 

అటు ఈ సినిమాను అనేక భాషల్లో రిలీజ్ చేయాలని ఇతర భాషల అభిమానులు విన్నవించుకోవడం వల్ల.. ఇప్పుడీ చిత్రాన్ని హిందీతో పాటు మరో 3 భారతీయ భాషల్లో డబ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్నాటకతో పాటు నార్త్ ప్రేక్షకులు ఈ సినిమాను సబ్ టైటిల్స్‌లో చూస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేసారు. 

తమిళంలో 'అఖండ' సినిమాకు సంబంధించిన డబ్బింగ్ హక్కులు అమ్ముడుపోయాయి. ఇప్పటికే తమిళ వెర్షన్ డబ్బింగ్ పనులు పూర్తి కావడంతో పాటు ఈ సినిమాను తమిళనాడులో శుక్రవారం (జనవరి 28)న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. దానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. 

మరోవైపు మలయాళం, కన్నడతో పాటు హిందీ హక్కులు తీసుకున్నవారు ఈ సినిమాను ఆయా భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ముందుగా హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అఘోరగా బాలయ్య పర్ఫామెన్స్ చూసి ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసేకంటే డైరెక్ట్ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ ఇతర కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

Also Read: 83 Movie OTT Relase: ఓటీటీలో విడుదలకు సిద్ధమైన 83 మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Also Read: Nagarjuna on Samantha Divorce: "విడాకులు అడిగింది సమంతనే".. నాగార్జున సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News