Veera Simha Reddy vs Waltair Veerayya ఈ ఏడాది సంక్రాంతి పోటీ ఎంత రసవత్తరంగా ఉందో అందరికీ తెలిసిందే. బరిలోకి చిరంజీవి, బాలయ్య దిగారు. బాలయ్య వీర సింహా రెడ్డికి మిక్స్డ్ టాక్ రాగా.. చిరంజీవి వాల్తేరు వీరయ్యకు పాజిటివ్ టాక్ వచ్చింది. డే వన్ రికార్డులో బాలయ్య దుమ్ములేపేశాడు. అయితే వాల్తేరు వీరయ్యకు పాజిటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్లలో భారీ మార్పులు కనపడేట్టుంది.
అయితే ఈ రెండు చిత్రాలు కూడా ఒకే స్టోరీ లైన్‌తో తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. వీర సింహా రెడ్డిలో సవతి తల్లి పిల్లల మీదే ఉంటుంది. బాలయ్య, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు సవతి తల్లి పిల్లలు. సవతి తల్లికి పుట్టినా కూడా సొంత చెల్లిలా చూసుకుంటాడు వీర సింహా రెడ్డి. అయితే తన అన్నను తప్పుగా అర్థం చేసుకుని పగ తీర్చుకోవాలని వీర సింహా రెడ్డిని చంపేస్తుంది భానుమతి. ఇది వీర సింహా రెడ్డి కథ.
ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో వీరయ్య (చిరంజీవి), ఏసీపీ విక్రమ్ (రవితేజ)లు వేర్వేరు తల్లులకు జన్మిస్తారు. సవతి తల్లి బిడ్డల మధ్య ఉండే కోపాలతోనే ఈ ఇద్దరూ పెరుగుతారు. ప్రేమ ఉన్నా కూడా బయటకు వ్యక్తం చేయలేరు. అలాంటిది తన తమ్ముడి మీద పడ్డ మచ్చను పోగొట్టేందుకు అన్నయ్య చేసే పోరాటమే వాల్తేరు వీరయ్య.
ఇలా రెండు సినిమాలు ఒకే పాయింట్ మీద రావడం యాదృశ్చికంగా జరిగిందో ఏమో గానీ.. దర్శకులిద్దరూ మాత్రం ఒకే లైన్‌లో ఆలోచించారు. కానీ ట్రీట్మెంట్ మాత్రం పూర్తి భిన్నంగానే సాగింది. ఈ రెండు చిత్రాల్లోనూ వాల్తేరు వీరయ్యకు జనాలు కాస్త మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. మున్ముందు బాక్సాఫీస్ వద్ద చిరు, బాలయ్యలు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారు?.. సంక్రాంతి సీజన్ ముగిసే వరకు ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
Also Read: Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్
Also Read: Veera Simha Reddy Twitter Review : వీర సింహా రెడ్డి ట్విట్టర్ స్టోరీ.. బోయపాటి కన్నా అరాచకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి