Balakrishna: ముచ్చటగా మూడోసారి సెంచరీ కొట్టిన బాలయ్య.. 33 ఏళ్ల తర్వాత ఆ రేర్ ఫీట్ రిపీట్..

Balakrishna: టాలీవుడ్ టాప్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఈయన పుల్ స్వింగ్ లో ఉన్నారు. హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు. తాజాగా మరో ఘనతను సాధించారు బాలయ్య.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2023, 04:32 PM IST
Balakrishna: ముచ్చటగా మూడోసారి సెంచరీ కొట్టిన బాలయ్య.. 33 ఏళ్ల తర్వాత ఆ రేర్ ఫీట్ రిపీట్..

Bhagavanth Kesari: 60 ఏళ్ల వయసులో కూడా బాలయ్య సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. అఖండ, వీరనరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్స్ హిట్ సాధించి పుల్ జోష్ లో ఉన్నాడు బాలకృష్ణ. వరసగా మూడోసారి భగవంత్ కేసరి సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టాడు ఈ సీనియర్ హీరో. టాలీవుడ్ అగ్రహీరోల్లో వరుసగా మూడోసారి వంద కోట్ల మార్కును క్రాస్ చేసిన హీరోగా బాలయ్య అరుదైన ఘనతను సాధించాడు. అంతేకాకుండా ఈ మూడు సినిమాలు ఓవర్సీస్‌లో 1 మిలియన్ మార్క్ ను అందుకున్నాయి. 1990లో నారినారి నడుమ మురారి, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్ తర్వాత బాలయ్య హ్యాట్రిక్ కొట్టలేదు. 33 ఏళ్ళ తర్వాత అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో ఈ ఫీట్ ను రిపీట్ చేశాడు నటసింహం.

నందమూరి బాలకృష్ణ నయా మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ ఆరు రోజుల్లోనే 100 కోట్ల మైలురాయిను అందుకుంది. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలో బాలయ్య జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. మరో కీలకపాత్రలో టాలీవుడ్ సెన్షెషన్ శ్రీలీల నటించింది. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ  అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ డిసెంబరు రెండో వారంలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది. 

Also Read: Tillu Square: థియేటర్లను బ్లాస్ట్ చేయడానికి రెడీ అయిన సిద్దు.. టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News