Bigg Boss 4th Housemate : నాలుగో హౌస్‍మేట్‍గా రైతు బిడ్డ.. ముఖం మాడ్చుకున్న సీరియల్ బ్యాచ్!

BB 7 Telugu: బిగ్ బాస్ 7 తెలుగు  చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.  పవర్ ఆస్త్రాను గెలిచి.. హౌస్ మేట్ అయ్యేందుకు తెగ కష్టపడుతున్నారు. నాలుగో హౌస్ మేట్ ఎవరు అయ్యారంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2023, 11:44 AM IST
Bigg Boss 4th Housemate : నాలుగో హౌస్‍మేట్‍గా రైతు బిడ్డ.. ముఖం మాడ్చుకున్న సీరియల్ బ్యాచ్!

Bigg Boss 7 Housemate: బిగ్ బాస్ 7 తెలుగు రోజురోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్లు హౌస్ మేట్ అయ్యేందుకు తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి హౌస్ మేట్స్ కాగా... నాలుగో పవర్ ఆస్త్రాను గెలిచి ఇంటి సభ్యులు అవ్వడానికి మిగతా కంటెస్టెంట్స్ ఎలాంటి పనిన్నైనా చేయడానికి సిద్ధమయ్యారు. కంటెండర్ అయ్యేందుకు ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.  ఇందులో కంటెస్టెంట్ల బిగ్ బాస్ ప్రోపర్టీని ఉపయోగించుకుని రెడీ అవ్వాల్సి ఉంటుంది. మరో కంటెండర్ ను నిర్ణయించే బాధ్యతను శివాజీ, సందీప్, శోభా శెట్టికి ఇచ్చాడు పెద్దయ్య. ఈ కంటెండర్ పోటీలో శుభ శ్రీని విజేతగా ప్రకటించారు. దీంతో కోపంతో ఊగిపోయాడు అమర్. న్యాయనిర్ణేతలపై ప్రశ్నల వర్షం కురిపించాడు. సందీప్, శోభా, శివాజీలను నిలదీశాడు. అయితే ఈ సమయంలో శివాజీ, అమర్ దీప్ ల మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. 

నాలుగో పవర్ ఆస్త్రా రేసులో కంటెండర్స్ గా చివరకి యావర్, ప్రశాంత్, శుభ శ్రీ నిలిచారు. వీరికి ఓ చిన్న టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పవర్ అస్త్రాను వదలకుండా ముగ్గురిలో ఎవరు పట్టుకుంటారో వారికే హౌస్ మేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు. దీనికి శివాజీ సంచాలకుడిగా వ్యవహారిస్తాడని తెలిపారు. దీంతో యావర్, ప్రశాంత్, శుభ శ్రీ పవర్ అస్త్రాను గంటల తరబడి అలానే పట్టుకుని ఉన్నారు. రతిక, అమర్ దీప్ కలిసి పల్లవి ప్రశాంత్ ను బాగా డిస్టర్బ్ చేశారు. అయినా సరే అతడు పవర్ అస్త్రాను విడిచిపెట్టలేదు. ముగ్గురిలో ఎవరూ కుడా కన్విన్స్ అవ్వలేదు. దీంతో బిగ్ బాస్ ఆ టాస్క్ ను రద్దు చేసి మరోకటి ఇచ్చాడు. 

మూడు స్టిక్స్ పెట్టి.. వాటికి చివరలో పవర్ అస్త్రాను నిలువుగా ఉంచాలని.. ఎక్కువ సేపు ఎవరు ఆపుతారో వారే నాలుగో హౌస్ మేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ లో గెలిచి ప్రశాంత్ నాలుగో హౌస్ మేట్ అయ్యాడు. దీంతో సీరియల్ బ్యాచ్ ముఖాలు మాడిపోయాయి. ఇంటి సభ్యుడైన అయిన తర్వాత ప్రశాంత్ కు శివాజీ మంచి మాటాలతో బూస్ట్ ఆఫ్ ఇచ్చాడనే చెప్పాలి. 

Also Read: BB 7 Telugu Elimination: నాలుగో వారం డబుల్ ఎలిమినేషన్.. డేంజర్ లో వారిద్దరూ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News