Bellamkonda Sai Sreenivas Movie with Sagar Chandra: అయ్యారే సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించాడు సాగర్ చంద్ర. ఆ తర్వాత చాలా కాలం పాటు దర్శకత్వానికి దూరంగానే ఉన్న సినిమా;ఆ రచనల విషయంలో హెల్ప్ చేస్తూ ఉండేవాడు. అయితే ఇటీవలే భీమ్లా నాయక్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సాగర్ చంద్ర తన తర్వాతి సినిమా విషయం మీద మాత్రం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు.
భీమ్లా నాయక్ సినిమాకి దర్శకత్వం వహించింది సాగర్ చంద్ర అయినా సినిమా విషయంలో త్రివిక్రమ్ అన్నీ స్వయంగా చూసుకున్నారని అన్ని విషయాల్లో ఆయనే పర్యవేక్షించారని ప్రచారం జరుగుతూ ఉండడంతో ఈ సినిమా క్రెడిట్ కూడా పెద్దగా సాగర్ చందకు దక్కలేదనే చెప్పాలి. అయితే ఎట్టకేలకు సాగర్ చంద్ర ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఎంట్రీకి ప్రయత్నించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాగర్ చంద్రతో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పీరియాడిక్ కథతో సాగబోతున్న ఈ సినిమా ఒక డిఫరెంట్ వేలో ఉంటుందని చెబుతున్నారు. 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఆ మధ్య సాగర్ చంద్ర వరుణ్ తేజ్ తో 14 డేస్ ప్లస్ బ్యానర్ లో ఒక సినిమా ఉంటుందని ప్రకటించారు. కానీ తర్వాత బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అవుతూ ఉండడంతో ఆ ప్రాజెక్టు బ్రేకులు పడ్డాయి.
అయితే ఇప్పుడు ఆ కథతోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే వరుణ్ తేజ్ కి వచ్చిన బడ్జెట్ ఇబ్బందులు ఇప్పుడు సాయి శ్రీనివాస్ ఎందుకు రావడం లేదు అనే విషయం మీద చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఇది వేరే కథ అయి ఉంటుందని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయం మీద సాగర్ చంద్ర క్లారిటీ ఇస్తే తప్ప నిజం ఏమిటనేది తెలియదు.
Also Read:Balakrishna Sorry: సారీ చెప్పడానికి రెడీగా లేని బాలయ్య.. విషెస్ చెప్పాడు కానీ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bellamkonda Movie with Sagar Chandra: ఎట్టకేలకు సినిమా పట్టేసిన పవన్ దర్శకుడు