Bengaluru high court key order on actress hema case: గతేడాది బెంగళూరులో చోటు చేసుకున్న రేవ్ పార్టీ ఘటన టాలీవుడ్ లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. నటిహేమ బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిపోయారని పోలీసులు ఆమె ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. ఆతర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
తాను డ్రగ్స్ తీసుకొలేదని, ఫామ్ హౌస్ లో ఛిల్ అవుతున్నానని, తన ఇంట్లో బిర్యానీ వండుతున్నానని కూడా నటి హేమ పలు వీడియోలను రిలీజ్ చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆమె ఫోటోలను రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ ఘటన టాలీవుడ్ ను షేక్ చేసిందని చెప్పుకొవచ్చు. అంతే కాకుండా.. దీనిపై బెంగళూరు పోలీసులు ఆమెను హైదరాబాద్ కు వచ్చి మరీ అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నటి హేమ మాత్రం.. బెయిల్ మీద ఉన్నట్లు తెలుస్తొంది.
ఈ క్రమంలో పోలీసులు జరిపిన టెస్టులలో ఆమెకు పాజిటీవ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాను మాత్రం డ్రగ్స్ తీసుకొలేదని నటి చెప్తు వచ్చారు. అదే విధంగా బెంగళూరు హైకోర్టు ఎదుట పిటిషన్ సైతం దాఖలు చేశారు.
Read more: Tirumala: న్యూ ఇయర్ వేళ శ్రీవారి భక్తులకు వరుస శుభవార్తలు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..
ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించినట్లు తెలుస్తొంది. విచారణపై స్టే కోరుతూ హేమ దాఖలు చేసిన.. ఇంటర్‌లోక్యూటరీ అప్లికేషన్ (ఐఎ) ను అనుమతిస్తూ బెంగళూరు హైకోర్టు స్టే విధిస్తూ తీర్పు నిచ్చింది. ఈ క్రమంలో నటి హేమకు మాత్రం బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter