Bigg Boss inaya : ఆ ఆడియెన్స్ ఏంటో.. ఆ బిగ్ బాస్ టీం ఏంటో?.. హోస్ట్‌కు దండం పెట్టాల్సిందే

Bigg Boss 6 Telugu 9th Weekend బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం ఎలా జరిగిందో అందరూ చూశారు. మిషన్ పాజిబుల్ టాస్క్‌ ఒకవైపు జరుగుతూనే ఉంది.. శ్రీహాన్ కెప్టెన్సీలో ఇనయకు ఫుడ్ మీద అభ్యంతరాలు కూడా వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2022, 11:26 AM IST
  • బిగ్ బాస్ ఇంట్లో తిండి కోసం పాట్లు
  • పాలు, టీపై ఇనయ ప్రశ్నలు
  • నాగ్, బిగ్ బాస్ టీం వ్యాఖ్యలివే
Bigg Boss inaya : ఆ ఆడియెన్స్ ఏంటో.. ఆ బిగ్ బాస్ టీం ఏంటో?.. హోస్ట్‌కు దండం పెట్టాల్సిందే

Bigg Boss inaya :  బిగ్ బాస్ ఇంట్లో ఫుడ్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ టీం ఇచ్చే ఫుడ్డే తగినంత ఉంటుంది. అందులో కంటెస్టెంట్లు వృథా చేయడం కూడా జరుగుతుంది. చపాతి గురించి గొడవలు జరిగిన సీజన్లున్నాయి. గుడ్డు పోయిందంటూ వాగ్వాదానికి దిగిన ఘటనలున్నాయి. అయితే ఈ ఆరో సీజన్లో మాత్రం పాలు, టీ విషయంలోనూ గొడవలు జరుగుతున్నాయి. ఈ వారం ఎక్కువగా ఇనయ ఫుడ్ విషయంలో ఇబ్బంది పడింది.అది కూడా శ్రీహాన్ కెప్టెన్ అవ్వడం వల్లే జరిగినట్టుగా అనిపిస్తోంది.

శ్రీహాన్, ఇనయ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది వ్యవహారం. ఈ ఇద్దరికీ ఏ మాత్రం పడదు. అయితే ఈ వారం మాత్రం ఇనయ పస్తులుండాల్సి వచ్చింది. కర్రీ లేదని, ఫుడ్ అందలేదని నీళ్లు తాగేసి పడుకుంది. ఇక టీ, పాలు విషయంలోనూ ఆమెకు ఇబ్బందే ఏర్పడింది. పాలు తాగే వారికి ఒకేసారి మాత్రమే ఎందుకు సప్లై చేస్తున్నారు.. టీ అయితే రెండు సార్లు ఎందుకు తాగుతున్నారు? అంటూ అడిగేసింది ఇనయ. ఇదే విషయంలో నాగార్జున కూడా స్టేజ్ మీద అడిగేశాడు.

పాలు తాగడం వారు.. పాలతో టీ చేసిన తరువాత డివైడ్ చేయడం వేరు అంటూ నాగార్జున, బిగ్ బాస్ టీం చెప్పింది. ఒక కప్పు టీ, ఒక కప్పు పాలు సేమ్ ఎలా అవుతాయ్ అని అనేశాడు. అసలు టీ ఎలా చేస్తారో చెప్పు అని ఇనయను నాగార్జున అడిగాడు. మూడు కప్పుల పాలు, ఒక కప్పు నీళ్లు అని ఇనయ చెప్పింది. అదేదో పెద్ద మహా పాపం అన్నట్టుగా.. ఆమెకు టీ పెట్టడమే తెలియదన్నట్టుగా చూపించారు.

ఇక అక్కడ ఉన్న వారు నిజంగానే ఆడియెన్స్ అయినట్టు.. ఓ పెయిడ్ బ్యాచ్‌ను పట్టుకొచ్చి కూర్చోబెడతారు. వాళ్లలోంచి ఓ మహిళను టీ ఎలా పెడతారు అని అడిగితే.. ఆ మహాతల్లి మాత్రం ఒక కప్పు పాలు, మూడు కప్పుల నీళ్లు అని చెప్పేసింది. అప్పుడు అది పాల టీ కాకుండా.. నీళ్ల టీ అవుతుంది. ఇలా సిల్లీగా ఆడియెన్స్ చేత చెప్పించడం, నీళ్లు, పాలు అంటూ అసలు విషయాలను మాత్రం పట్టించుకోలేదు బిగ్ బాస్ టీం, నాగార్జున.

టాస్క్ జరిగే సమయంలో ఇనయ నోరు పారేసుకోవడం, ఇనయ నోరు పారేసుకుంది కదా? అని రేవంత్ పిచ్చి పిచ్చిగా వెక్కిరించడం, శ్రీ సత్య కళ్లు తాగిన కోతిలా ఎగిరెగిరి పడటం, అవతలని వాళ్లని కించపరిచేలా ఎగతాళి చేసింది. వీటిపై నాగార్జున సీరియస్ అవ్వలేదు కదా? పొగిడేసినట్టుగా మాట్లాడాడు. సత్యను హెచ్చరించాల్సిందిపోయి.. రెచ్చిపోయావ్ కదా? అంటూ బాగా ఆడినట్టుగా కితాబిచ్చాడు.

ఇక గీతూ చేసిన వాటిని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. బాలాదిత్య వీక్నెస్ పట్టుకుని ఆడిన గీతూని.. మీ అన్న సిగరెట్లు మానేయాలని అలా చేశావా?అని అమాయకంగా అడిగేశాడు. ఇక బాలాదిత్య గీతూ విషయంలో ఆదిత్యదే తప్పని అక్కడున్న పెయిడ్ ఆడియెన్స్ కూడా అన్నారు. అసలు బిగ్ బాస్ టీం ఏం చేస్తోందో? నాగార్జున ఏం చెబుతున్నాడో? ఆ ఆడియెన్స్ కనీసం బిగ్ బాస్ చూస్తారో కూడా తెలియడం లేదు.

Also Read : Mahesh Babu Remuneration : నిజం సినిమాకు మహేష్‌ ఎంత తీసుకున్నాడంటే.. రెమ్యూనరేషన్, బడ్జెట్‌, లాభాలపై తేజ కామెంట్స్

Also Read : Shannu-Deepthi : ఇంకా డిప్రెషన్‌లోనే ఉన్నాడా?.. దీప్తిని మరిచిపోలేకపోతోన్న షన్ను

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News