Mahesh Babu Remuneration : నిజం సినిమాకు మహేష్‌ ఎంత తీసుకున్నాడంటే.. రెమ్యూనరేషన్, బడ్జెట్‌, లాభాలపై తేజ కామెంట్స్

Mahesh Babu Remuneration For Nijam డైరెక్టర్ తేజ జీ తెలుగు న్యూస్‌తో ముచ్చటిస్తూ అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తాను నిజం సినిమాకు మహేష్‌ బాబుకు ఎంత రెమ్యూనరేషన్ ఇప్పించాడో చెప్పుకొచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2022, 10:31 AM IST
  • జీ తెలుగు న్యూస్‌తో డైరెక్టర్ తేజ
  • చిత్రం, జయం సినిమాలకు పెట్టింది ఎంతంటే?
  • మహేష్‌ బాబు రెమ్యూనరేషన్ గురించి తేజ కామెంట్స్
Mahesh Babu Remuneration : నిజం సినిమాకు మహేష్‌ ఎంత తీసుకున్నాడంటే.. రెమ్యూనరేషన్, బడ్జెట్‌, లాభాలపై తేజ కామెంట్స్

Mahesh Babu Remuneration : డైరెక్టర్ తేజ ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఒకరి మెప్పు కోసం ఎప్పుడూ ఏ పని చేయడు. తనకు నచ్చితేనే సినిమాలు చేస్తానని అంటాడు. నిజం సినిమా ఫ్లాప్ విషయంలోనూ తనదే తప్పని చెబుతుంటాడు. మహేష్‌ బాబు అద్భుతమైన నటుడు, దర్శకుడు చెప్పినట్టుగా నటిస్తుంటాడు.. నిజంలోనూ మహేష్‌ బాబు చెప్పింది చేశాడంటూ ఇలా దర్శకుడు తేజ చెబుతుంటాడు. అలాంటి తేజ జీ తెలుగు న్యూస్‌తో ముచ్చటిస్తూ అనేక ఆసక్తికరమైన విషయాల మీద తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

నిజం సినిమా కోసం మహేష్‌ బాబుకు భారీ రెమ్యూనరేషన్ ఇప్పించినట్టుగా చెప్పాడు. అప్పటికి ఇంకా ఒక్కడు సినిమా రిలీజ్ కాలేదని, బాబీ సినిమా కోసం నలభై లక్షల వరకు తీసుకునేవాడని, కానీ తాను మాత్రం కోటి ఇరవై లక్షలు ఇప్పించానంటూ మహేష్ బాబు రెమ్యూనరేషన్ గురించి నిజం చెప్పేశాడు తేజ.

ఇక తన మొదటి సినిమా 'చిత్రం' గురించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు. చిత్రం సినిమాను 40 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కించినట్టుగా చెప్పుకొచ్చాడు. అదే జయం సినిమాను రెండు కోట్లతో తెరకెక్కించినట్టు పేర్కొన్నాడు. ఆ ట్రెయిన్ సీక్వెన్స్ ఉండటంతో బడ్జెట్ కాస్త పెరిగిందని తెలిపాడు. అయితే జయం సినిమా దాదాపు ఇరవై కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని అన్నాడు.

ఇక తేజ తెలుగు హీరోల రెమ్యూనరేషన్, దర్శకుల రెమ్యూనరేషన్, బడ్జెట్‌ల మీద కూడా స్పందించాడు. మన హీరోలు, దర్శకులు ఇంకా బాగా తీసుకోవచ్చు.. మనం ప్రస్తుతం బాలీవుడ్ కంటే ఎక్కువ.. మన వాళ్లు ఇంకా తీసుకోవాలి.. మన ఇండస్ట్రీ ఇంకా ఎదగాలి.. అంటూ తేజ చెప్పుకొచ్చాడు. హీరో, హీరోయిన్ల మార్కెట్‌ను బట్టే రెమ్యూనరేషన్ ఉంటుందని తేజ అసలు విషయం చెప్పుకొచ్చాడు.

తేజ తనకు పూజా హెగ్డే ఎవరో తెలీదని అందరినీ ఆశ్చర్యపరిచాడు. గాడ్ ఫాదర్ టాక్, కలెక్షన్ల మీద కూడా అంతగా స్పందించలేదు. కాంట్రవర్సీ ఎందుకు అని అనుకున్నాడో ఏమో గానీ.. గాడ్ ఫాదర్ మీద పెద్దగా స్పందించేందుకు మాత్రం ఇష్టపడలేదు.

Also Read : Shannu-Deepthi : ఇంకా డిప్రెషన్‌లోనే ఉన్నాడా?.. దీప్తిని మరిచిపోలేకపోతోన్న షన్ను

Also Read : Teja on Uday Kiran: చేయాల్సిందంతా చేసి కాళ్లు పట్టుకోవడానికి వచ్చాడు.. క్షమించనని చెప్పా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News