Bigg Boss Amardeep: హీరోగా ఎంట్రీ ఇస్తున్న బిగ్‌ బాస్ అమర్‌దీప్.. హీరోయిన్‌గా సురేఖావాణి డాటర్

Bigg Boss Amardeep New Movie: బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ హీరోగా పరిచయం అవుతున్నాడు. హీరోయిన్‌గా సుప్రీతను ఎంపికవ్వగా.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2024, 06:11 PM IST
Bigg Boss Amardeep: హీరోగా ఎంట్రీ ఇస్తున్న బిగ్‌ బాస్ అమర్‌దీప్.. హీరోయిన్‌గా సురేఖావాణి డాటర్

Bigg Boss Amardeep New Movie: సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి హీరోగా.. నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. వీరిద్దరు జంటగా మహర్షి కూండ్ల సమర్పణలో M3 మీడియా బ్యానర్‌పై మహా మూవీస్‌తో కలిసి ప్రొడక్షన్ నెం 2గా మహేంద్ర నాథ్ కూండ్ల ఈ మూవీని నిర్మిస్తున్నారు. గురువారం హైదరాబాద్‌ ప్రసాద్ ల్యాబ్‌ పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి బసిరెడ్డి క్లాప్ కొట్టారు. ఏఎం రత్నం కెమెరా స్విఛ్‌ ఆన్ చేయగా.. వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించింది.

నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. M3 బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా ఈ మూవీ నిర్మిస్తున్నట్లు తెలిపారు. మన ఇండియన్ ఇండస్ట్రీలో ఎవరు టచ్ చేయని పాయింట్ ఇది అని.. చాలా కొత్తగా ఉంటుందన్నారు. డైరెక్టర్ మాల్యాద్రి రెడ్డి డైరెక్టర్ మాట్లాడుతూ.. తమ లాంటి కొత్తవాళ్లను M3 మీడియా ఎంతో ప్రోత్సహించిందన్నారు. యంగ్ టాలెంట్ ఉన్న వాళ్లని ఎంకరేజ్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

హీరో అమర్‌దీప్ చౌదరి మాట్లాడుతూ.. బిగ్ బాస్ కంటే ముందే ఈ మూవీకి ఒకే చేశానని.. షో తరువాత ఒప్పుకున్న సినిమా కాదన్నారు. దర్శకుడు మాల్యాద్రి తన స్నేహితుడు అని.. చాలా ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ తన కోసమే రాసుకున్నారని చెప్పారు. ప్రొడ్యూసర్ మహేంద్ర సపోర్ట్‌ను ఎప్పుడూ మరచిపోలేనని.. సుప్రితతో పని చేస్తుండడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. సుప్రిత మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. అమర్ దీప్‌తో కలిసి యాక్ట్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు. 

గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. బిగ్ బాస్ ఇంట్లో తమ ఇద్దరికీ ఎంతో మంచి గుర్తులు ఉన్నాయన్నారు. తామిద్దరం అంటే చాలా ఇష్టమని ఫ్యామిలీ ఆడియన్స్ చెబుతుండేవారని అన్నారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాని అన్నారు. సురేఖా వాణి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ విన్న తర్వాత చేస్తారా..? లేదా..? అని అనుమానం వచ్చిందని.. రఘు వల్లే ప్రాజెక్ట్ ముందుకు వెళ్లిందని అన్నారు. దర్శక నిర్మాతల మీద నమ్మకంతోనే తన బిడ్డ సుప్రీతను వాళ్ల చేతుల్లో పెట్టానని చెప్పుకొచ్చారు. అమర్ దీప్, సుప్రితలను ఆశీర్వదించడానికి ఇంత మంది రావడంతో ఇదే పెద్ద విజయంలా అనిపిస్తోందన్నారు.

రాజారవీంద్ర, రూపాలక్ష్మి, వినోద్ కుమార్, ఎస్తేర్ నొరోన్హా, ఆకు మాణిక్ రెడ్డి, తల్లాడ సాయి కృష్ణ, మహబూబ్ బాషా, జబర్దస్త్ దుర్గారావు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎడిటర్‌గా మేనగ శ్రీనివాస్ పనిచేస్తుండగా.. దాస్ కడియాల ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. డీఓపీగా బాల సరస్వతి పనిచేస్తున్నారు. 

Also Read: IT Slabs: ఉద్యోగులపై జాలి చూపని నిర్మలమ్మ.. పొగడ్తలు తప్ప ఒక్క రూపాయి లాభం లేదు

Also Read: Telangana Jobs: నిరుద్యోగుల్లారా మీకు నేనున్నా.. కేసీఆర్‌లా కాదు 2 లక్షల ఉద్యోగాలిస్తా: రేవంత్‌ రెడ్డి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News