Ashu Reddy Focus : అషూ రెడ్డి మీదే ఫోకస్.. పోలీస్‌ ఆఫీసర్‌గా బిగ్ బాస్ బ్యూటీ అదుర్స్

Ashu Reddy New Movie అషూ రెడ్డి ఫోకస్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం నేడు థియేటర్లో సందడి చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2022, 06:00 PM IST
  • బిగ్ బాస్ బ్యూటీగా అషూ రెడ్డికి క్రేజ్
  • అషూ రెడ్డి కొత్త సినిమా విడుదల
  • ఫోకస్ మూవీలో పోలీస్‌గా అషూ రెడ్డి
Ashu Reddy Focus : అషూ రెడ్డి మీదే ఫోకస్.. పోలీస్‌ ఆఫీసర్‌గా బిగ్ బాస్ బ్యూటీ అదుర్స్

Ashu Reddy Focus Movie : బిగ్ బాస్ బ్యూటీగా అషూ రెడ్డికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఇది వరకు ఆమెకు సైడ్ కారెక్టర్‌లో చాన్స్ వచ్చేది. కానీ ఇప్పుడు అషూ రెడ్డి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. విజయ్ శంకర్ హీరోగా భానుచందర్, సుహాసిని ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఫోకస్ మూవీతో అషూ రెడ్డి హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చింది. ఈ చిత్రం నేడు విడుదల కాగా.. పోలీస్ ఆఫీసర్‌గా అషూ రెడ్డి అందరినీ మెప్పించింది.

ఫోకస్ చిత్రం మొత్తం కూడా ఎస్పీ వివేక్ వర్మ పాత్రలో నటించిన భాను చందర్ హత్య చుట్టూ తిరుగుతుండగా.. దాన్ని చేధించే క్రమంలో పోలీస్ ఆఫీసర్ ప్రేమ కారెక్టర్‌లో అషూ రెడ్డి రంగంలోకి దిగుతుంది. ప్రేమ కంటే ముందు విజయ్ శంకర్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఎందుకు అంత సంక్లిష్టంగా మారింది? అసలు ఆ హత్య చేసింది ఎవరు? మధ్యలో ప్రేమ ఎందుకు వచ్చింది? అసలు ఈ కథలో జడ్జ్ ప్రమోదా దేవి సుహాసిని పాత్ర ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ కథను క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించడంతో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది.గ్రిప్పింగ్ కథ, కథనాలతో దర్శకుడు అందరినీ మెప్పించేసేట్టుగా అనిపిస్తున్నాడు. మర్డర్ మిస్టరీ కథలకు ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోకస్ కూడా అదే జానర్‌లో తెరకెక్కించడం ప్లస్ అయిన అంశం. ఇందులో హీరో హీరోయిన్ల ట్రాక్ కూడా బాగానే కలిసి వచ్చింది.

విజయ్ శంకర్ ఈ సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా మారిపోయాడు. లుక్స్, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నింట్లోనూ మెప్పించాడు. అషూ రెడ్డి తన అందంతో పాటు నటనతోనూ మెప్పించేసేలా ఉంది. సీరియస్ లుక్‌లో అషూ రెడ్డి అందరినీ ఆకట్టుకునేస్తుంది. అయితే భాను చందర్, సుహాసిని వంటి సీనియర్లు వాళ్ల వాళ్ల అనుభవాన్ని చూపించారు. ప్రతీ పాత్ర కూడా సినిమాలో హైలెట్ అయ్యేట్టుగా ఉంది. సాంకేతికంగానూ సినిమా మెప్పిస్తుంది. మాటలు, పాటలు, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలా అన్ని కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

ఇక ఇది అషూరెడ్డికి మొదటి చిత్రం కావడం, హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో అందరి ఫోకస్ ఆమె మీదే ఉంటుంది. ఫోకస్ సినిమాతో అందరి ఫోకస్‌ను తన వైపునకు తిప్పుకున్నట్టు అనిపిస్తోంది. మరి మున్ముందు అషూ రెడ్డి హవా ఎలా ఉంటుందో చూడాలి.

Also Read : Vishnu Manchu Wife : ఆపనికి ఇంట్లో ఒప్పుకోవడం లేదట!.. మంచు విష్ణు ట్వీట్.. నెటిజన్ల కౌంటర్లు

Also Read : Hamida Khatoon New Benz Car : కొత్త కారు కొన్న హమీద.. దాని రేటు ఎంతంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News