Bootcut Balaraju: 'బూట్ కట్ బాలరాజు'గా బిగ్ బాస్ సోహెల్.. మూవీ ఎలా ఉందంటే..?

Bootcut Balaraju Movie Review and Rating: 'బూట్ కట్ బాలరాజు'గా ఆడియన్స్ ముందుకు వచ్చాడు బిగ్ బాస్ సోహెల్. కోనేటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎండీ పాషా నిర్మించారు. మేఘలేఖ హీరోయిన్‌గా యాక్ట్ చేయగా.. సునీల్, ఇంద్రజ, సిరి హనుమంత్, జబర్దస్త్‌ రోహిణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2024, 12:54 PM IST
Bootcut Balaraju: 'బూట్ కట్ బాలరాజు'గా బిగ్ బాస్ సోహెల్.. మూవీ ఎలా ఉందంటే..?

Bootcut Balaraju Movie Review and Rating: బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా.. మేఘలేఖ హీరోయిన్‌గా కోనేటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'బూట్ కట్ బాలరాజు'. సునీల్, ఇంద్రజ, సిరి హనుమంత్, జబర్దస్త్‌ రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎండీ పాషా నిర్మించగా.. భీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. సినిమాటోగ్రఫర్‌గా సినిమాటోగ్రఫీ గోకుల్ భారత వర్క్ చేయగా.. ఎడిటింగ్ బాధ్యతలను వినయ్ రామస్వామి వి నిర్వర్తించారు. ట్రైలర్‌తో మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ మూవీ నేడు ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూపై ఓ లుక్కేయండి.. 

కథ ఏంటంటే..?

బూట్ కట్ బాలరాజు (సోహెల్) ఊర్లో జులాయిగా తిరుగుతుంటాడు. అందరూ పనికి మాలిన వ్యక్తిగా చూస్తుంటారు. అదే ఊర్లో పటేలమ్మ (ఇంద్రజ) ఓ పెద్ద మనిషిలా.. అమ్మాలా అందరికీ సాయం చేస్తుంటుంది. ఆమె అంటే ఆ ఊర్లో ప్రజలకు ఎంతో గౌరవం. పటేలమ్మ కూతురు మహాలక్ష్మి (మేఘ లేఖ)కు బూట్ కట్ బాలరాజుకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహం ఉంటుంది. కొన్ని నాటకీయ పరిణామాల నడుమ బూట్ కట్ బాలరాజును సిరి (సిరి హన్మంతు) ప్రేమిస్తుంది. బాలరాజు తనకు దూరం అవుతాడనే భయంతో మహాలక్ష్మి తన ప్రేమ గురించి బాలరాజుకు చెప్పడంతో అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. పటేలమ్మకు బాలరాజుకు ఏం జరిగింది..? మహాలక్ష్మిని బాలరాజు దక్కించుకున్నాడా..? సర్పంచ్‌గా బాలరాజు ఎందుకు పోటీ చేయాల్సివచ్చింది..? పటేలమ్మపై బాలరాజు గెలిచాడా..? వంటివి తెలుసుకోవాలంటే 'బూట్ కట్ బాలరాజు' మూవీని చూడాల్సిందే. 

ఎవరు ఎలా నటించారు..?

సోహెల్ తన నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ సీన్స్‌లో నవిస్తునే ఎమోషన్స్‌ సీన్స్‌లో తన హావభావాలతో ఆకట్టుకున్నాడు. మేఘలేఖ తన యాక్టింగ్‌తో మెప్పిస్తుంది. సిరి హనుమంత్ తన పాత్రకు న్యాయం చేసింది. హీరోహీరోయిన్స్‌ మధ్య వచ్చే లవ్ సీన్స్‌ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ సినిమాను తన భూజాల మీద మోశాడు. వన్ మ్యాన్‌ షోగా అలరించాడు. సోహెల్ ఈ సినిమా కోసం పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. సోహెల్, ఇంద్రజ మధ్య సీన్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. సోహెల్ సర్పంచ్‌గా గెలిచే సీన్స్ తెరపై చాలా బాగుంటాయి. సునీల్, ఇంద్రజ, జబర్దస్త్‌ రోహిణి తమ పాత్రల పరిధి మేరకు అలరించారు. ముక్కు అవినాష్, సద్దాం ఆడియన్స్‌ను బాగా నవ్వించారు.  

డైరెక్టర్ కోనేటి శ్రీను తీసుకున్న కథాంశం చాలా బాగుంది. అయితే కొన్ని చోట్ల సీన్స్ చాలా సాదా సీదాగా అనిపిస్తాయి. లవ్ సీన్స్‌ చక్కగా తెరకెక్కించాడు. సెకండ్ హాఫ్‌లో స్క్రీన్‌ ప్లే మరింత ఇంట్రెస్టింగ్‌గా రాసుకుంటే బాగుండనిపిస్తుంది. పాటలు ఒకే అనిపిస్తాయి. కొన్ని సీన్స్‌ను ఎడిటర మరింత ట్రీమ్ చేయాల్సింది. సినిమాటోగ్రఫీగా చక్కగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను బూట్ కట్ బాలరాజు మూవీ అలరిస్తుంది. 

రేటింగ్: 2.75

Also Read:  EPFO Balance Check: UAN నంబర్ తో సంబంధం లేకుండా ఇలా సింపుల్ గా పీఎఫ్‌ బ్యాలన్స్ చెక్ చేసుకోండి..

Also Read: Bharata Ratna to LK Adwani: L.k అద్వానీకి భారతరత్న.. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News