Bigg Boss Telugu 7: గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్‌-7.. హౌజ్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్‌ వీళ్లే..

Bigg Boss Telugu 7: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆదివారం గ్రాండ్ గా ప్రారంభమైంది. మెుత్తంగా 14 కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. వారెవరంటే...  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 4, 2023, 12:24 PM IST
Bigg Boss Telugu 7: గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్‌-7.. హౌజ్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్‌ వీళ్లే..

Bigg Boss Telugu 7 Contestants list: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్(Bigg Boss Telugu Season 7) ఆదివారం గ్రాండ్ గా మెుదలైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యహారించిన ఈ లాంచ్ ఈవెంట్ కు యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి ముఖ్య అతిథులుగా వచ్చారు. వీరిద్దరు తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు బిగ్ బాస్ స్టేజ్ ఎక్కారు.  ముందుగా నాగార్జున బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి అక్కడి విశేషాలు పంచుకున్నారు. అనంతరం  కంటెస్టెంట్‌లను ఒక్కొక్కరిగా స్టేజిపైకి పిలిచి పరిచయం చేశారు. 

ఈ సీజన్ ను చాలా డిఫరెంట్ గా ఫ్లాన్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే బ్రీఫ్‌కేస్‌లో రూ.20 లక్షల క్యాష్‌ పెట్టి.. సీజన్‌ నుంచి వెళ్లిపోవాలనుకునేవాళ్లు డబ్బు తీసుకుని వెళ్లిపోవచ్చని మెుదటి 5 కంటెస్టెంట్‌లకు ఆశ చూపించారు నాగార్జున. ఆ తర్వాత రూ.5 లక్షల చొప్పున పెంచుకుంటూ రూ.35 లక్షల వరకూ వెళ్లారు. కానీ ఎవరూ దానికి ఒప్పుకోలేదు. తొలి రోజు మెుత్తంగా 14 కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. వారు ఎవరో తెలుసుకుందాం.

1. ప్రియాంక జైన్ (సీరియల్ నటి, మౌనరాగం సీరియల్ ఫేమ్)
2. శివాజీ (సినీ నటుడు)
3. ధామిని భట్ల (సింగర్)
4. ప్రిన్స్ యావర్ (మోడల్, సీరియల్ నటుడు)
5. శుభశ్రీ (నటి, న్యాయవాది)
6. షకీల (సీనియర్ నటి)
7. ఆట సందీప్ (డ్యాన్సర్, కొరియోగ్రాఫర్)
8. శోభా శెట్టి (సీరియల్ నటి)
9. టేస్టీ తేజ (జబర్దస్త్ యాక్టర్, యూట్యూబ్ ఫుడ్ వ్లాగర్)
10. రతిక రోజ్ (నటి, నేను స్టూడెంట్ సార్ మూవీ ఫేమ్)
11.గౌతమ్ కృష్ణ (నటుడు, ఆకాశ వీధుల్లో ఫేమ్)
12. కిరణ్ రాథోడ్ (పలు భాషల్లో హీరోయిన్‍గా నటించింది)
13. పల్లవి ప్రశాంత్ (రైతు - యూట్యూబర్)
14. అమర్‌దీప్ చౌదరి (సీరియల్ నటుడు, జానకి కలగనలేదు ఫేమ్)

Also Read: NTR:'ఆ పాత్రకు ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడు'..: గదర్-2 డైరెక్టర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News