Bobby Simha Thugs : కోలీవుడ్ విలన్ కొత్త సినిమా అప్డేట్.. బాబీ సింహా వెరైటీ లుక్

Bobby Simha New Movie బాబీ సింహ కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. థగ్స్ అంటూ పాన్ ఇండియన్ రేంజ్‌లో బాబీ సింహా రాబోతోన్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఆడియో అప్డేట్ వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2022, 10:31 AM IST
  • బాబీ సింహ కొత్త సినిమా అప్డేట్
  • థగ్స్ సినిమాలో బాబీ సింహ లుక్
  • మ్యూజిక్ పార్టనర్‌గా సోనీ మ్యూజిక్
Bobby Simha Thugs : కోలీవుడ్ విలన్ కొత్త సినిమా అప్డేట్.. బాబీ సింహా వెరైటీ లుక్

Bobby Simha New Movie Thugs : కోలీవుడ్‌లో అతి తక్కువ కాలంలో ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు బాబీ సింహా. విలన్‌గా కోలీవుడ్‌లో బాబీ సింహకు మంచి క్రేజ్ ఉంది. విలన్‌గా, సపోర్టింగ్ రోల్స్ చేయడమే కాకుండా హీరోగానూ చేస్తున్నాడు. అయితే జిగర్తాండ సినిమాతో బాబీ సింహా ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. తెలుగులో అయితే రవితేజతో డిస్కోరాజా సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ మధ్య చార్లీ సినిమాలో కనిపించి మెప్పించాడు. 
అయితే ఇప్పుడు బాబీ సింహా.. ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమాను పాన్ ఇండియన్ రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి థగ్స్ అనే పేరు పెట్టారు. రా యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందుతున్న థగ్స్ చిత్రాన్ని హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై రియా షిబు నిర్మాతగా నిర్మిస్తున్నాడు. థగ్స్ చిత్రంలో బాబీ సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ కీలక పాత్రల్లో కనిపించబోతోన్నారు.

హ్రిదు హరూన్ లీడ్ రోల్లో కనిపిస్తూ సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం కాబోతోన్నాడు. అమెజాన్లో వచ్చిన క్రాష్ కోర్స్ సీరీస్‌లో తన నటనతో అటు విమర్శకులను ఇటు ఆడియెన్స్‌ను కట్టిపడేశాడు. అతని చేతుల్లో ప్రస్తుతం పలు ప్రాజెక్టులున్నాయి. తాజాగా వీరి కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

థగ్స్ చిత్రం మ్యూజిక్, ప్రోమో కంటెంట్‌ను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో మార్కెటింగ్ చేయడానికి సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మధ్యే రిలీజ్ చేసిన కారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియోతో మంచి బజ్ క్రియేట్ అయింది. శామ్ సి ఎస్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్, ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లు చూసుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. మొత్తానికి బాబీ సింహా మరోసారి తన విలనిజంతో అందరినీ భయపెట్టబోతోన్నట్టుగా ఆ లుక్ చూస్తే అర్థమవుతోంది.

Also Read : Bigg Boss Faima : ఫైమాకు మూడింది.. వెటకారం మరీ ఎక్కువైంది.. ఈ వారం బయటకు వచ్చేస్తుందోచ్!

Also Read : Rambha Family Car Accident : హీరోయిన్ రంభ ఫ్యామిలీకి ప్రమాదం.. కారు యాక్సిడెంట్‌తో హాస్పిటల్లో.. కూతురిపై ఎమోషనల్ పోస్ట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News